Kayadu Lohar: కయదు లోహర్ (Kayadu Lohar).. ప్రముఖ యంగ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది..అంతేకాదు తెలుగు కుర్రకారు క్రష్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. మలయాళం, కన్నడ, తమిళ్ భాష చిత్రాలలో నటించి అలరించింది. కన్నడ చిత్రం 2021లో ‘ మొగిల్ పేట’ సినిమాతో తొలిసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.ఇక 2025 తమిళ భాషా చిత్రం ‘డ్రాగన్’ లో నటించి ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్గా కెరియర్ ఆరంభించిన కయదు లోహర్.. అస్సాంలోని తేజ్పూర్ లో 2000 ఏప్రిల్ 11న జన్మించింది. ఇకపోతే ‘డ్రాగన్’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమెకు ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం లభించడంతో అమ్మడి అదృష్టం మామూలుగా లేదు కదా అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఎస్ టి ఆర్ 49 లో కయదు లోహర్..
కయదు లోహర్ కి ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శింబు(Simbu ) 49వ సినిమాలో అవకాశం లభించింది. ప్రముఖ డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణ (Ram Kumar Balakrishna) తో ‘శింబు’ సినిమా చేయబోతున్నారు.
తాత్కాలికంగా ‘ఎస్ టి ఆర్ 49’ అనే వర్కింగ్ టైటిల్ ను ఫిక్స్ చేయడం జరిగింది. ఇకపోతే శింబు పుట్టినరోజు సందర్భంగా ఈ కాంబినేషన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు. డైరెక్టర్ రామ్ కుమార్ ‘పార్కింగ్’ అనే సినిమాతో ఇండస్ట్రీకి అరంగేట్రం చేశారు. ఇక సినిమా నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో శింబు ఇంజనీరింగ్ పుస్తకం పట్టుకొని, అటు తిరిగి నిలబడ్డాడు. వెనుక రెండు చేతులతో పుస్తకం పట్టుకొని ఉండగా, ఆ పుస్తకంలో రక్తంతో తడిచిన కత్తి కూడా ఉంది. అంతేకాదు అతని జేబులో నుంచి ఒక ఐడి కార్డు కూడా వేలాడుతూ ఉంది. పైగా ఈ పోస్టర్ కింద ” ది మోస్ట్ వాంటెడ్ స్టూడెంట్” అని ట్యాగ్ కూడా జోడించడం గమనార్హం. ఈ కొత్త చిత్రాన్ని డాన్ పిక్చర్స్ కు చెందిన ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈయన ధనుష్ ఇడ్లీ కడై , శివ కార్తికేయన్ పరాశక్తి చిత్రాలకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
కయదు లోహర్ అదృష్టం మామూలుగా లేదుగా..
ఇక ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక మొత్తానికైతే డ్రాగన్ సినిమాతో వెలుగులోకి వచ్చిన ఈమె ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకోవడం అంటే నిజంగా ఆశ్చర్యకరం అనే చెప్పాలి. మరి ఈ సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకొని, స్టార్ హీరోయిన్గా ఎదగాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కయదు లోహర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ మినహా ఇప్పుడు సౌత్ ఇండియా భాషలలో వరుసగా నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది కయదు లోహర్. అందులో భాగంగానే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా తనకు శింబు మూవీలో అవకాశం లభించిందని స్పష్టం చేసింది.