Robbery Godavari Express: ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఈ ట్రైన్ ప్రయాణాల్లో నిత్యం చోరీలు జరగడం సాధారణం అయిపోయింది. ఎప్పుడెప్పుడు చోరీ చేద్దామా అని ఎదురుచూస్తూ కేటుగాళ్ళు.. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, వారి బ్యాగులను దొంగతనం చేస్తున్నారు. స్టేషన్లలో రద్దీ సమయాల్లో.. విలువైన వస్తువులు మాయం చేస్తున్నారు.
సాయంత్రం నాలుగు గంటల సమయంలో.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న.. గోదావరి ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా స్టేషన్ నుండి బయలుదేరింది. ప్రయాణికుల హడావుడి తగ్గింది. ఓ మహిళ చేతిలో చిన్న హ్యాండ్‌బ్యాగ్, అందులో ఫోన్, వాలెట్, బంగారం, నగదు ఉన్నాయి.
ఆమె ఎదురుగా కూర్చున్నాడు ఒక యువకుడు.. హావభావాలకూ, చెప్పిన మాటలకూ చూడగానే మంచివాడిలా అనిపించాడు. కొంతసేపటికి ఆ మహిళ అలసిపోయి నిద్రలోకి జారుకుంది. నిదానంగా రైలు ఊగిసలాడటంతో గాఢ నిద్రలోకి జారుకుంది.
ఇక తెల్లవారుజామున మేల్కొనే సరికి కళ్ళు తడమగా తెరిచి చూసింది. చేతిలో బ్యాగ్ కనిపించలేదు! ఒక్క క్షణం గుండె ఆగినట్టు అనిపించింది. గబగబా వెతికింది.. అక్కడున్న ప్రయాణికులందరిని అడిగింది. కానీ ప్రయోజనం లేదు. పక్కన ఉన్న యువకుడు ఎప్పుడో కనిపించకుండా పోయాడు. అప్పుడు అర్ధమయింది. ఆమె నగలు చోరీకి గురయ్యాయని..
అసలేం జరిగిందంటే
సికింద్రాబాద్ గోదావరి ఎక్స్ ప్రెస్ రైల్లో.. నగరానికి వస్తున్న ఓ ప్రయాణికురాలి నగలు, నగదు చోరీకీ గురయ్యాయి. బాధితురాలు జీఆర్‌పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ.. వైజాగ్ నుంచి గోదావరి ఎక్స్ ప్రెస్ రైల్లో ఎక్కి ప్రయాణమైంది. ప్రయాణంలో 11 తులాల బంగారం, నగదు ఉన్న తన హ్యాండ్ బ్యాగును తన బెర్త్‌పై పెట్టుకుని నిద్రపోయింది. సోమవారం తెల్లవారుజామున.. రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న అనంతరం.. నిద్రలేచి చూసేసరికి హ్యాండ్ బ్యాగులో డబ్బులు, బంగారం కనిపించలేదు. దీంతో ఆ మహిళ జీఆర్‌పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మీ వస్తువులు చోరీకి గురికాకుండా ఉండాలంటే.. ఈ విషయాలు తప్పనిససరిగా గుర్తించుకోండి.
చోరీలు జరిగే సమయం..
రద్దీగా ఉండే జనరల్ బోగీల్లో..
స్లీపర్ క్లాసులో రాత్రి సమయాల్లో..
ప్లాట్‌ఫామ్స్‌పై ట్రైన్ ఆగినప్పుడు..
దీనికి ముఖ్యమైన కారణాలు:
భద్రత లోపం..
ప్రయాణికుల గబగబా ప్రయాణం చేయడం వల్ల అప్రమత్తత లోపించడం.
సీసీ టీవీ పరిమిత పరిధి.
Also Read: ఈ 5 రైల్వే రూల్స్ గురించి తెలిస్తే.. మీ సమయం, డబ్బు రెండూ ఆదా ? ఎలాగంటే..
ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
విలువైన వస్తువులను ఎప్పుడూ తనతో పెట్టుకోవడం.
నిద్రపోయే ముందు లగేజీని చైన్‌తో కట్టివేయడం.
అనుమానాస్పద వ్యక్తులను గమనించి, అవసరమైతే అధికారులకు సమాచారం ఇవ్వడం.