Khushboo.. ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ (Khushboo Sundar) కి తాజాగా గాయాలయ్యాయి. ఈ మేరకు తన చేతికి కట్టుతో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఇక ఆమెకు గాయాలవడం చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటికి ఏమైంది అంటూ ఆరాతీస్తున్నారు. చేతికి కట్టుతో ఉన్న ఫోటోని ఆమె ఇన్స్టాలో షేర్ చేస్తూ..” అనుకోని గాయాలు మన ప్రయాణాన్ని ఆపాలని చూసినా మీరు మాత్రం ఆగిపోవద్దు.. చిరునవ్వుతో ముందుకు సాగండి” అంటూ ఆమె రాసుకొచ్చింది. ప్రస్తుతం కుష్బూ షేర్ చేసిన ఈ ఫోటోలు, అలాగే పెట్టిన సందేశం అభిమానులను కాస్త ఆలోచింపచేసేలా చేస్తున్నాయి. ఖుష్బూ ఏదో చేయాలని అనుకుంది. కానీ అనుకోని కారణాలవల్ల ఆమె గాయపడిందేమో అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఖుష్బూకి గాయాలయ్యాయి కానీ అది ఎలా జరిగింది అనే విషయంపై మాత్రం ఆమె వెల్లడించలేదు.
నటిగానే కాదు జడ్జిగా కూడా..
ఒకప్పుడు తెలుగు, తమిళ్ చిత్రాలలో వరుసగా అవకాశాలు అందుకుంటూ.. హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఖుష్బూ.. ఈ మధ్య జబర్దస్త్ వేదికపై జడ్జిగా వ్యవహరిస్తూ.. తన కామెడీ పంచ్ లతో అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కమెడియన్స్ తో కలగలిసిపోయి జోకులు వేస్తూ.. పంచులు విసురుతూ భారీ పాపులారిటీ అందుకుంది ఖుష్బూ. దీంతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు అయిందని చెప్పవచ్చు. గత 13 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న ప్రముఖ కామెడీ షో జబర్దస్త్(Jabardast ) ఈమె కెరియర్ కు మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చింది అని కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఖుష్బూ సినిమా జీవితం..
ప్రముఖ నటిగా రాజకీయ వేత్తగా గుర్తింపు సొంతం చేసుకుంది ఖుష్బూ. తెలుగులో కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత పేకాట పాపారావు, స్టాలిన్, రాక్షస సంహారం, తేనెటీగ, జై సింహ వంటి చిత్రాలలో నటించి భారీగా పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా వెంకటేష్ (Venkatesh) సరసన హీరోయిన్గా నటించిన ఈమె , చిరంజీవి ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవి (Chiranjeevi) కి అక్కగా నటించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాలో స్టెప్ మదర్ గా కూడా నటించి ఆకట్టుకుంది. ఇక ఇప్పటికే వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఖుష్బూ. ఒక ఖుష్బూ రాజకీయ జీవిత విషయానికి వస్తే.. బిజెపి పార్టీలో కొనసాగుతున్న ఈమె అటు పార్టీ అంశాలలో కీలకంగా పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలపై చర్చిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో జరిగే అంశాలపై కూడా స్పందించే ఈమె అప్పుడప్పుడు వివాదాలలో కూడా ఇరుక్కుంటూ ఉంటుందని చెప్పవచ్చు. గతంలోనే ఒకసారి గాయాల పాలైన ఖుష్బూ ఇప్పుడు మళ్లీ ఇలా ఇంజూర్ అవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తులు చేస్తూ జాగ్రత్తగా ఉండండి అంటూ సలహాలు ఇస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">