Gongadi Trisha: మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగిన అండర్-19 మహిళల టి-20 వరల్డ్ కప్ లో టీమిండియా రెండవసారి ప్రపంచకప్ సాధించిన విషయం తెలిసిందే. మహిళల అండర్-19 ప్రపంచ కప్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించింది తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష. ఈ టోర్నీ మొత్తంలో తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత్ కి రెండవసారి ప్రపంచకప్ అందించడంతోపాటు.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది త్రిష.
Also Read: Mohammed Siraj: వివాదంలో సిరాజ్…తిలకం ఎందుకు పెట్టుకోవు అంటూ ట్రోలింగ్ ?
ఈ టోర్నీలో సంచలన బ్యాటింగ్ తో పాటు అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఫైనల్ మ్యాచ్ లో 33 బంతులలో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లోను మూడు వికెట్లు పడగొట్టింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టోర్నీ ఆఫ్ ది టీమ్ లో కూడా గొంగడి త్రిషతో పాటు నలుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. త్రిషతోపాటు జీ కమలిని, ఆయుషి శుక్ల, వైష్ణవి శర్మ ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఈ టోర్నీలో 11 వికెట్లతో హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచిన సౌత్ ఆఫ్రికా క్రికెటర్ కైలా రేనేకే ను కెప్టెన్ గా ఎంపిక చేసింది ఐసీసీ.
ఇక ఈ టోర్నీలో గొంగడి త్రిష 77.25 సగటుతో 309 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఈ టోర్నీ టాపర్ గా నిలవడమే కాకుండా.. బౌలింగ్ లో ఏడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది. ఇక అండర్ 19 వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష తాజాగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. దీంతో ఆమెకి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్వాగతం పలికారు.
త్రిషని ఆదర్శంగా తీసుకొని మిగతా క్రికెటర్లు రాష్ట్రం నుంచి సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. వీరిద్దరితోపాటు టీమ్ హెడ్ కోచ్ నూసిన్, ఫిట్నెస్ ట్రైనర్ శాలిని కూడా వచ్చారు. వీరికి క్రికెట్ అభిమానులు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రిష మీడియాతో మాట్లాడుతూ.. ” అండర్-19 వరల్డ్ కప్ లో మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇకనుండి మరింత కష్టపడి జాతీయ మహిళా క్రికెట్ జట్టులో చోటు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తాం.
Also Read: Sanju Samson: రాజస్థాన్ కు బిగ్ షాక్.. ఐపీఎల్ కు సంజూ దూరం.. అతనికి కెప్టెన్సీ ?
వరల్డ్ లాంటి మెగా టోర్నీ అని ఎలాంటి ఒత్తిడిని తీసుకోలేదు. ప్రతి మ్యాచ్ లో మా పాత్ర ఏంటని మాత్రమే ఆలోచించాం. జట్టుకూర్పులో భాగంగా ఈసారి త్రిదికి అవకాశం రాలేదు. తాను చాలా మంచి ప్లేయర్. త్రిది భవిష్యత్తులో కచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తుంది. నా ప్రతి విజయంలో మా నాన్న ఉన్నాడు. అలాగే బీసీసీఐ, హెచ్సీఏ నుంచి పూర్తి మద్దతు లభించింది. నాకు సహకరించి, అభిమానించిన అందరికీ ధన్యవాదాలు. నాకు మిథాలీ రాజ్ ఇన్స్పిరేషన్. వరల్డ్ కప్ సాధించిన టీమ్ లో ఉండడం ఆనందంగా ఉంది. గతంలో నాకు అవకాశాలు రాలేదు. ఇప్పుడు బెస్ట్ ఆఫ్ టోర్నీగా నిలవడం సంతోషంగా ఉంది” అని చెప్పుకొచ్చింది.
మిథాలీ రాజ్ నాకు ఇన్స్పిరేషన్: త్రిష
వరల్డ్ కప్ సాధించిన టీమ్ లో ఉండటం ఆనందంగా ఉంది
నా విజయానికి కారణం మా అమ్మ, నాన్నే
గతంలో నాకు అవకాశాలు రాలేదు.. ఇప్పుడు బెస్ట్ ఆఫ్ టోర్నీగా ఉండటం సంతోషంగా ఉంది
– త్రిష https://t.co/qSUJL4ZLMV pic.twitter.com/BwPB55sHq2
— BIG TV Breaking News (@bigtvtelugu) February 4, 2025