HBD Priety zinta:ప్రీతి జింటా.. ఇండస్ట్రీలోకి రాకముందు మోడలింగ్ రంగ ప్రవేశం చేసి..పెర్క్ చాక్లెట్, లిరిల్ సోప్ వంటి వాణిజ్య ప్రకటనలలో పనిచేసిన ప్రీతి జంటా ఆ తర్వాత బాలీవుడ్లో ‘దిల్ సే’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఇక తర్వాత తెలుగులో వెంకటేష్ (Venkatesh) సరసన ‘ప్రేమంటే ఇదేరా’ అనే సినిమాలో నటించి, మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1998లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు (Maheshbabu) తో కలిసి 1999లో ‘రాజకుమారుడు’ సినిమాలో నటించింది. ఇక్కడ తన అందం అభినయంతో మహేష్ కి తగ్గ జోడీ అనిపించుకుంది. ఆ తర్వాత తన నటనతో పలు చిత్రాలలో నటించి, భారీ పాపులారిటీ అందుకుంది. ఇక ప్రీతి జింటా 2016 ఫిబ్రవరి 29న లాస్ ఏంజెల్స్ లోని ఒక వ్యక్తిగత వేడుకల్లో అమెరికన్ భాగస్వామ్యం జీన్ గూడెనఫ్ (Gene Goodenough) ను వివాహం చేసుకోగా.. ఈయన యూఎస్ కి చెందిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సంస్థలో ఫైనాన్స్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇక వీరికి సరోగసి పద్ధతిలో ఇద్దరు కవల పిల్లలు జన్మించారు.
ఏకంగా 34 మంది పిల్లలను అడాప్ట్ చేసుకున్న ప్రీతిజింటా..
ఇకపోతే ఈరోజు ప్రీతి జింటా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఇండస్ట్రీలో ఏ ఒక్క హీరోయిన్ చేయని అతిపెద్ద సాహసం చేసి, అందరి మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను అడాప్ట్ చేసుకోవడం మన చూశాం. అయితే ప్రీతి జింటా మాత్రం తనకు సినిమాల ద్వారా, యాడ్స్ ద్వారా వచ్చే సంపాదనలో కొంత భాగాన్ని ఛారిటీ ట్రస్ట్ లకు ఇస్తూ ఉంటుంది. అంతేకాదు ఏకంగా 2009లో 34 మంది అనాధ పిల్లలను రిషికేశ్ నుండి దత్తత తీసుకుంది. వారికి సంబంధించి పూర్తి బాధ్యతను తానే తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ .ఏది ఏమైనా ఏకంగా 34 మంది అనాధ పిల్లలను దత్తత తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ తో డేటింగ్ పై ప్రీతి జింటా క్లారిటీ..
ఇకపోతే ప్రీతి జింటా ఇలా సహాయాలు, దానధర్మాలు చేస్తూ వార్తల్లో నిలవడమే కాకుండా కొన్ని రూమర్స్ కారణంగా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా వార్తల్లో నిలుస్తోంది. అందులో భాగంగానే సల్మాన్ ఖాన్ (Salman Khan) తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు రాగా వాటిపై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా గత ఏడాది సల్మాన్ ఖాన్ కు పుట్టినరోజు సందర్భంగా ఆమె తన ఎక్స్ వేదికగా సల్మాన్ ఖాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టింది. దీంతో ఒక నెటిజన్ ఈమెను..” మీ ఇద్దరు ఎప్పుడైనా డేట్ లో ఉన్నారా?” అంటూ ప్రశ్నించారు. దీనికి ఫస్ట్ ఆమె ఆశ్చర్యపోయి ఆ తర్వాత తనదైన శైలిలో సమాధానం తెలిపింది.”సల్మాన్ ఖాన్ నాకు కుటుంబ సభ్యులతో సమానం. మేమిద్దరూ డేట్ చేయలేదు.అలాగే నా భర్తకు ఆయన మంచి స్నేహితుడు.. నా సమాధానంతో మీరు ఆశ్చర్యానికి గురైతే నన్ను క్షమించండి”.. అంటూ తన పోస్టులో తెలిపింది.అలా మొత్తానికైతే తనదైన శైలిలో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ప్రీతి జింటా.