Heroine Sada: ఒకప్పుడు తమ నటనతో, అందంతో ప్రేక్షకులను మెప్పించి, ఇప్పటికీ అదే అందంతో దూసుకుపోతున్న అతికొద్ది మంది హీరోయిన్ లలో సదా కూడా ఒకరు. ఈమె తోటి వారంతా కూడా పెళ్లిళ్లు చేసుకొని, పిల్లలకు జన్మనిచ్చి సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటే.. సదా మాత్రం 40 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే తాను మాత్రం పెళ్లి చేసుకోకపోయినా హ్యాపీగానే ఉన్నాను అంటూ సదా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి, స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సదా.. ప్రస్తుతం ఆఫర్స్ లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. మొన్నామధ్య కాలంలో ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న డాన్స్ ప్రోగ్రాం కి జడ్జిగా వ్యవహరించిన సదా.. ప్రస్తుతమైతే ఇండస్ట్రీకి దూరంగానే ఉంది. అయితే అలాంటి సదా గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, పెళ్లి విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ పెళ్లి పై సదా అభిప్రాయం ఎలా ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం..
అలాంటి పెళ్లికి నేనెప్పుడూ వ్యతిరేకమే – సదా
నాలుగు పదుల వయసు దాటినా.. వివాహం అనే పదానికి దూరంగా ఉంది సదా.. మరి భవిష్యత్తులోనైనా పెళ్లి చేసుకుంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే పెళ్లి గురించి ఆమె స్పందన ఎలా ఉందంటే.. నచ్చినవాడు దొరికితే చేసుకుంటాను అంటుంది. కానీ పెళ్లి చేసుకోకపోయినా సింగిల్ గా ఉండైనా నేను హ్యాపీగానే ఉన్నాను అని అభిమానులని తికమక పెడుతోంది.అయితే అలాంటి సదా గతంలో ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో సదా కి పెళ్లి, విడాకుల గురించి ప్రశ్న ఎదురయింది. ఆ ప్రశ్నకి సదా(Sadha) సమాధానం ఇస్తూ.. చాలామంది సమాజం ఏమనుకుంటుందో అనే ఒత్తిడితో పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి వివాహాన్ని నేను వ్యతిరేకిస్తాను.వాస్తవానికి నేను పెళ్లికి వ్యతిరేకిని కాదు. కానీ అలా ఎవరు ఏమనుకుంటారో అని బలవంతంగా పెళ్లి చేయడాన్ని మాత్రం వ్యతిరేకిస్తాను.. అలాగే ఒక రిలేషన్ షిప్ ని ఇబ్బందులు పడుతూ దాన్ని కంటిన్యూ చేయడం కంటే విడిపోవడమే బెటర్ ” అంటూ సదా (Sadha) పెళ్లి విడాకులపై మాట్లాడింది.
పెళ్లిపై సదా అలాంటి కామెంట్స్..
అలాగే మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని ప్రశ్నించగా..”నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. కానీ ఒంటరిగా ఉన్నా కూడా నేను హ్యాపీగానే ఉన్నాను. నాకు ఇది చాలు” అని ఆన్సర్ ఇచ్చింది.అలాగే మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? అని మీడియా వాళ్ళు అడగగా.. “నాకు అరేంజ్ మ్యారేజ్ ఇష్టం లేదు. అయితే అలాంటి పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు కూడా సంతోషంగానే ఉన్నారు. కానీ నా దృష్టిలో మాత్రం ముక్కు, మొహం తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండటం అనేది నాకు నచ్చదు.. ప్రస్తుతం నేను సింగల్ గానే బాగున్నాను. పెళ్లి చేసుకొని కపుల్ అయితే వేరే లోకం ఏదో వస్తుంది అనేది మాత్రం నాకు తెలియదు. నేను ఇలాగే హ్యాపీగా ఉన్నాను”.. అంటూ పెళ్లి పైన తన అభిప్రాయాన్ని బయట పెట్టింది సదా. ఇక సదా (Sada) మాటలు చూస్తుంటే ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకునే లేదు అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.