Laila movie: లైలా మూవీ రిలీజ్ సంధర్భంగా నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 11 అంటూ పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ కి వైసీపీ సోషల్ మీడియా సినిమా గురించి ట్రోలింగ్ చేస్తోందని హీరో విశ్వక్ సేన్ ఆరోపించారు. తాజాగా ఏపీకి చెందిన మాజీ మంత్రి. వైసీపీకి చెందిన మహిళా నేత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అది కూడ మున్ముందు తమ పవర్ చూపిస్తామనే రేంజ్ లో ఆ మహిళా నేత ట్వీట్ చేశారు.
హీరో విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా 14న రిలీజ్ కానుంది. ఈ సంధర్భంగా నిర్వహించిన రిలీజ్ వేడుకలో పాల్గొన్న నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. 11 గొర్రెలు అంటూ కామెంట్స్ చేశారు. తమకు ఎక్కడికి వెళ్ళినా 11 ఉంటుందని కూడ అన్నారు. ఈ కామెంట్స్ తమను ఉద్దేశించి చేసినవే అంటూ వైసీపీ సోషల్ మీడియా ఆగ్రహించింది. వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయనే ధోరణిలో పృథ్వీ కామెంట్స్ చేశారని తెగ ట్రోలింగ్ కూడ సాగింది. హీరో విశ్వక్ సేన్ జోక్యం చేసుకొని సారీ కూడ చెప్పారు. తన సినిమాను ఒకరి కోసం బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించడం తగదని చెబుతూ.. లైలా సినిమాను ఆదరించాలని కోరారు.
అయితే 11 అంటూ కామెంట్స్ చేసిన పృథ్వీరాజ్ మాత్రం అనారోగ్యానికి గురయ్యారు. తనను ట్రోలింగ్ చేయడం వల్లే మానసికంగా ఇబ్బంది పడినట్లు పృథ్వీ తెలిపారు. హీరో విశ్వక్ సేన్ మాత్రం ఏపీలో పర్యటిస్తూ ఓ వైపు సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ దశలో మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి సంచలన ట్వీట్ చేశారు. తమ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, అధినేత జగన్ ను ఎవరు కించపరిచినా వాళ్లకి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. సినిమా ఇండస్ట్రీకి తాము వ్యతిరేకం కాదన్నారు.
హీరో విశ్వక్ సేన్ ను ఉద్దేశించి.. మేము మీ లైలా సినిమాకి వ్యతిరేకం కాదు. మా మీద జోకులు వేసే ఆర్టిస్టులకు మాత్రమే వ్యతిరేకం. ఇప్పటి నుండి అలాంటి ఆర్టిస్టు ఉన్న ప్రతి సినిమా కి మాత్రమే మేము వ్యతిరేకం అంటూ తేల్చి చెప్పారు. తాము టికెట్ కొని మరీ మా మీద మీతో జోకులు వేయించుకొనే అంత పిచ్చి గొర్రెలం మాత్రం కాదన్నారు. మన మీద జోకులు వేసే ఆర్టిస్ట్ ప్రతి సినిమాని Boycott చేయండి అంటూ ఆమె వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Also Read: కొడుకులే వారసులు అవుతారా.. మరి ఉపాసన? మెగాస్టార్ కు శ్యామల సూటి ప్రశ్న
ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇప్పటికే వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడ ఇదే విషయంపై స్పందించారు. ఇలాంటి వాటిని నిరోధించాల్సిన భాద్యత సినిమా యూనిట్స్ పై ఉంటుందని, ఇలాంటి కామెంట్స్ చేయరాదన్నారు. కాగా పృథ్వీరాజ్ మాత్రం తనకు విపరీతమైన కాల్స్ వస్తున్నాయని, తాను ఉద్దేశపూర్వకంగా అనలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం లైలా బాయ్ కాట్ అనేది ఇంకా వైరల్ గా మారింది. మొత్తం మీద ఈ నెల 14 న సినిమా విడుదల కానుండగా, వైసీపీ ట్రోలింగ్స్ ప్రభావం సినిమా మీద కనిపిస్తుందా లేదా అన్నది ఆరోజు కనిపించే అవకాశం ఉంది. హీరో విశ్వక్ సేన్ మాత్రం ఇప్పటికే సారీ చెప్పగా, తన సినిమా హిట్ కావడం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మా పార్టీ (అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, మా అధినేత)ని ఎవరు కించపరిచినా వాళ్లకి మాత్రమే మేము వ్యతిరేకం, సినిమా ఇండస్ట్రీకి కాదు. విశ్వక్ సేన్ గారు మేము మీ లైలా సినిమాకి వ్యతిరేకం కాదు. మా మీద జోకులు వేసే ఆర్టిస్టులకు మాత్రమే వ్యతిరేకం. ఇప్పటి నుండి అలాంటి ఆర్టిస్టు ఉన్న ప్రతి…
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) February 11, 2025