Samantha : ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్నానంటూ సమంత స్వయంగా ప్రకటించారు. తనకు వచ్చిన వ్యాధి పేరు మయోసిటిస్ అని ప్రకటించారు. ఇంతకీ మయోసిటిస్ అంటే ఏంటి? ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?
‘మయోసిటిస్’ వ్యాధి లక్షణాలు సివియర్ గానే ఉంటాయి. ఇందులో పలు రకాలు ఉన్నాయి. చిన్న పనులకే నీరసపడిపోవడం.. కండరాల నొప్పి.. త్వరగా అలసిపోవడం.. సడెన్ గా కిందపడిపోవడం.. తదితర సింప్టమ్స్ ఉంటాయి. అయితే, సమంత డెర్మటోమయోసైటిస్ రకంతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. చర్మంపై దద్దుర్లు రావడం ప్రధాన సమస్య. మహిళలు, చిన్నారుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
సమంత తనకు మయోసిటిస్ సమస్య ఉందని పోస్ట్ పెట్టగానే.. నెట్ లో ఆ వ్యాధి గురించి పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. మయోసిటిస్ ను గూగుల్ చేస్తున్నారు. చర్మంపై దద్దుర్లు.. కండరాల బలహీనతే ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. కొంతకాలంగా సమంత చర్య వ్యాధితో బాధపడుతున్నారని ప్రచారం జరుగుతుండగా.. లేటెస్ట్ గా సమంత క్లారిటీతో అది మయోసిటిస్ గా తేలిపోయింది. ఎంతైనా.. అందాలరాశి సమంతకు ఇలాంటి స్కిన్ డిసీజ్ రావడం బాధాకరం. గెట్ వెల్ సూన్ సామ్..అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.