PDS Rice Missing Case: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ప్లాన్ బూమరాంగ్ అయ్యిందా? ఆయన ప్లాన్ బెడిసి కొట్టిందా? ముఖ్యమంత్రి-మంత్రుల మధ్య చిచ్చు పెట్టాలని భావించి బుక్కయ్యారా? ఇప్పుడు ఆయన అడ్డంగా ఇరుక్కుపోయారా? రేపో మాపో ఆయనను పోలీసులు విచారించనున్నారా? అవుననే సంకేతాలు ప్రభుత్వ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
రేషన్ బియ్యం వ్యవహారం వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఆ పార్టీలో మాటల మాంత్రికుడిగా పేరుపొందిన మాజీ మంత్రి పేర్నినాని చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఆయనను ఏ-6గా చేరుస్తూ మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నాని ఆదేశాల మేరకు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారట.
కేసు నమోదైన నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేపో మాపో ఆయన్ని అరెస్టు చేయడం ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌కు పేర్నినాని ప్లాన్ చేస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కేసులో ఇప్పటికే నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి న్యాయస్థానం 12 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకి తరలించారు. ఇందులో ఏ-1గా పేర్నినాని భార్య జయసుధ పేర్కొన్నారు. ఆమెకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ALSO READ: జగన్‌ని ఆటాడుటున్న కూటమి సర్కార్.. ఓ వైపు సీఎం, మరోవైపు డిప్యూటీ సీఎం
ఇదిలావుండగా రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంలో కీలక అప్‌డేట్. కాకినాడ పోర్టు బియ్యం బోకర్ల నుంచి రూ. 94 లక్షలు A-2గా ఉన్న మానస తేజ బ్యాంక్ ఖాతాకు వచ్చినట్టు గుర్తించారట. మానస తేజ అకౌంట్ నుంచి పేర్నినాని సతీమణి అకౌంట్‌కు భారీ ఎత్తున నగదు బదిలీ అయినట్టు సమాచారం. దీనివెనుక గుడ్లవల్లేరు మండలం పురిటిపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని గతరాత్రి చీరాలలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
వైసీపీ రూలింగ్‌లో ట్రాన్స్‌పోర్టు శాఖ మంత్రిగా వ్యవహరించారు పేర్ని నాని. ఆ సమయంలో భార్య జయసుధ పేరిట గోదాంను నిర్మించారు. ఆ తర్వాత పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల ఆ శాఖ అధికారులు గోదాంను తనిఖీలు చేశారు. లెక్కలకు, బియ్యం నిల్వల్లో వ్యత్యాసం కనిపించింది. పెద్ద ఎత్తున పీడీఎస్ రైస్ మాయం అయినట్టు గుర్తించిన విషయం తెల్సిందే.
రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో A6గా పేర్ని నాని
ఇప్పటికే ఈ కేసులో నలుగురు అరెస్టు
ఏ1 గా ఉన్న పేర్ని నాని భార్య జయసుధకి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన జిల్లా కోర్టు
తాజాగా ఏ6గా పేర్ని నానిని చేర్చిన పోలీసులు https://t.co/19Ip4FnTdo pic.twitter.com/yQstypGAak
— BIG TV Breaking News (@bigtvtelugu) December 31, 2024