HBD Shruthi Hassan : విశ్వనటుడు కమలహాసన్ (Kamal Hassan) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ (Shruthi Hassan) ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే డిజాస్టర్ ను మూటగట్టుకున్న ఈమె..ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా.. పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఈమె కెరియర్ అయిపోయిందని, ఇక వెను తిరిగి వెళ్లాల్సిందే అని అందరూ అనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో ‘గబ్బర్ సింగ్’ సినిమా చేసి, మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే ఈమె కెరియర్ మారిపోయింది. ఇక ఆ తర్వాత రవితేజ (Raviteja) తో ‘క్రాక్’ సినిమా చేసి మళ్లీ గాడిలోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. చివరిగా ‘సలార్’ సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు దక్కించుకున్న శృతిహాసన్, అడివి శేష్ (Adivi shesh) హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఏమైందో తెలియదు కానీ చిత్ర బృందంతో కాస్త విభేదాలు రావడం వల్లే సినిమా నుంచి తప్పుకుంది.
శృతిహాసన్ ఆస్తుల వివరాలు..
ఇదిలా ఉండగా ఈరోజు శృతిహాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ఒక్కో సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది? ఆమె ఆస్తుల వివరాలేంటి? తండ్రికి తెలియకుండా ఈమె ఎంత కూడబెట్టింది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. శృతిహాసన్.. 1996 జనవరి 28న చెన్నై తమిళనాడులో జన్మించిన ఈమె, నటిగానే కాకుండా ప్లే బ్యాక్ సింగర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. కమలహాసన్ దర్శకత్వం వహించిన..’హే రామ్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి కెరియర్ ఆరంభించిన శృతిహాసన్ 2008లో ‘లక్’ అనే సినిమాలో ఇమ్రాన్ ఖాన్ (Emran Khan) సరసన నటిగా తొలి సినిమా చేసింది. ఇకపోతే శృతిహాసన్ కెరియర్ ను కాస్త పక్కన పెడితే.. వ్యక్తిగతంగా ఎన్నో విషయాలలో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఇద్దరితో డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్న ఈమె, చివరికి ఆ ఇద్దరికీ దూరమై ఒంటరిగా జీవిస్తోంది. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త తోడు కోసం ఎదురుచూస్తోంది శృతిహాసన్. ఇదిలా ఉండగా శృతిహాసన్ పుట్టినరోజు కావడంతో పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే శృతిహాసన్ ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.4 నుండి రూ.5కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈమె తన సినిమాల ద్వారా పలు యాడ్స్ ద్వారా బాగా సంపాదించింది. ఇప్పటివరకు శృతిహాసన్ ఆస్తి విలువ సుమారు రూ. 60 కోట్లు ఉంటుందని సమాచారం. అంతేకాదు ముంబైలోని బాంద్రాలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ను కూడా కొనుగోలు చేసింది.
శృతిహాసన్ కార్ కలెక్షన్స్..
శృతిహాసన్ కార్ కలెక్షన్స్ విషయానికి వస్తే..రేంజ్ రోవర్ ఈవోక్, రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి q7 తో పాటు టయోటా ఫార్చునర్ వంటి కార్లు ఆమె కార్ గ్యారేజీ లో ఉన్నాయి. మొత్తానికైతే తండ్రి సంపాదనపైన ఆధారపడకుండా సొంతంగా సినిమాల ద్వారా భారీగా సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.