Bangalore Police: ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ క్రిస్ గోపాలకృష్ణన్ అడ్డంగా బుక్కయ్యా రు. ఆయనపై బెంగుళూరు పోలీసులు ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు మరో 16 మంది ఆ జాబితాలో ఉన్నారు. అసలేం జరిగిందనే డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.
2014లో హనీట్రాప్ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఐఐఎస్‌సీ మాజీ ప్రొఫెసర్, బోవీ కమ్యూనిటీకి చెందిన దుర్గప్ప ఆరోపించారు. కులపరమైన విమర్శలతో తనను బెదిరించారని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు 71వ సిటీ సివిల్ సెషన్ కోర్టు ఆదేశాలతో బెంగుళూరులోని సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
గోపాలకృష్ణన్, బలరాం మొదలైనవారు తనను అక్రమంగా ఇరికించారన్నది దుర్గప్ప మాట. ప్రస్తుతం గోపాల కృష్ణన్ ఐఐఎస్సీ బోర్డు ట్రస్టీస్‌కు సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరి బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేయడంపై ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
ALSO READ: లడ్డూల కోసం ఎగబడ్డ జనం.. ఐదుగురు మృతి.. 60 మందికి తీవ్రగాయాలు