Shruti Haasan:విశ్వనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమలహాసన్(Kamal Hassan)కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైంది శృతిహాసన్(Shruti Haasan). తన నటనతో ఇండస్ట్రీలో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది కానీ సక్సెస్ కాలేదు. అందులో భాగంగానే తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే డిజాస్టర్ ను మూటగట్టుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు.దీంతో చాలామంది ఈమెను ఐరన్ లెగ్ అని సంబోధించారు కూడా.. ఫలితంగా కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన శృతిహాసన్ తిరిగి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ నిరూపించుకుంది. ఆ సినిమా తర్వాత మళ్లీ వెను తిరిగి చూడలేదు ఈ ముద్దుగుమ్మ. అలా సినిమాల పరంగా స్టార్ స్టేటస్ ను అందుకుంటూ దూసుకుపోతున్న శృతిహాసన్ మంచి సింగర్ కూడా.. ఈమె వాయిస్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇదిలా ఉండగా శృతిహాసన్ ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవిత కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. ఇప్పటికే ఇద్దరిని లవ్ చేసి, వారితో డేటింగ్ కూడా చేసిన ఈమె ఇప్పుడు వారిద్దరికీ దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కొత్త తోడును కోరుకుంటోంది.అదేంటో ఇప్పుడు చూద్దాం.
పెళ్లికి సిద్ధమే..
ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్, తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.శృతిహాసన్ మాట్లాడుతూ..”జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఊహించని విధంగా మార్పులు చోటుచేసుకుంటాయి.. గతంలో నేను కూడా పెళ్లి చేసుకోను అని చెప్పాను. అయితే ఎప్పటికీ చేసుకోను అని మాత్రం చెప్పలేదు కదా.. నేను రిలేషన్ లో ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడతాను. ముఖ్యంగా రొమాంటిక్ గా ఉండడం అంటే ఇష్టం. నా చుట్టూ ఉండే వారితో కూడా నేను చనువుగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. పెళ్లి చేసుకునే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా సరే నా మనసుకు దగ్గర అయితే, వారిని నేను వివాహం చేసుకుంటాను. పెళ్లి అనేది పూర్తిగా నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయం కాబట్టి నా నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నా స్నేహితులు, బంధువులు కూడా ఎంతో మంది వివాహం చేసుకున్న తర్వాత తమ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. కాబట్టి నేను కూడా భవిష్యత్తులో మంచి వ్యక్తి దొరికితే వివాహం చేసుకుంటాను” అంటూ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం శృతిహాసన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తాజాగా శృతిహాసన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ తన అందాలతో మరొకసారి ఆకట్టుకుంది.
శృతిహాసన్ సినిమాలు..
ఇదిలా ఉండగా రీసెంట్ గా ప్రభాస్(Prabhas) సరసన ‘సలార్’ సినిమాలో చేసి మెప్పించింది. ప్రస్తుతం సలార్ 2, కూలీ వంటి చిత్రాలలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.