Venkatesh: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh ) ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నారు వెంకటేష్. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ సినిమాలు మంచి విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రాబోతున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు. అందులో భాగంగానే వెంకటేష్ తన వంతు ప్రమోషన్స్ మొదలుపెట్టారని చెప్పవచ్చు.
బాలయ్య షోలో సందడి చేసిన వెంకటేష్..
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె’ సీజన్ 4 ఎపిసోడ్ 7కి గెస్ట్ గా హాజరయ్యారు వెంకటేష్. ఇక తన అన్నయ్య , నిర్మాత సురేష్ బాబు(Suresh Babu), డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)కూడా ఈ షోలో సందడి చేశారు. ఇకపోతే సాధారణంగా వెంకటేష్ మాత్రమే సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి అంశంలో స్పందిస్తూ ఉంటారు. ఆయన ఫ్యామిలీ ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలు తెలుసుకోవడానికి అభిమానుల సైతం ఆతృత కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలయ్య షోలో వెంకటేష్ కొడుకు సినీ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
అర్జున్ ఎంట్రీ పై వెంకటేష్ ఏమన్నారంటే..
కొడుకు అర్జున్ ఇండస్ట్రీ ఎంట్రీ పై వెంకటేష్ మాట్లాడుతూ..” అర్జున్ వయసు ప్రస్తుతం 20 సంవత్సరాలు. అర్జున్ అమెరికాలో చదువుకుంటున్నారు. ఆయన చాలా నెమ్మదస్తుడు అంటూ” తెలిపారు వెంకటేష్. మరి సినిమాల్లోకి అర్జున్ వస్తున్నాడా? అనే విషయంపై తన కొడుకు గురించి వెంకటేష్ ఏమని చెప్పాడు? అనే విషయం తెలుసుకోవాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు ఎదురుచూడక తప్పదు. ఏది ఏమైనా వెంకటేష్ కొడుకు అర్జున్ ఇండస్ట్రీలోకి రావాలని అభిమానులు మాత్రం బాగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.
డైరెక్టర్ ను కార్నర్ చేసిన హీరోలు..
ఇకపోతే షోలో భాగంగా స్టార్ సీనియర్ హీరోలైన వెంకటేష్, బాలకృష్ణ ఇద్దరూ డైరెక్టర్ అనిల్ రావిపూడిని సరదాగా కార్నర్ చేశారు. ఇరుకున పెట్టే ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టారు. బాలయ్య వెంకటేష్ లలో ఎవరికి హీరోయిన్ మీనాక్షి చౌదరి సరిజోడు? అనే ప్రశ్న వేయగా.. బాలయ్య వెంకీ తో కలిపి ఒక మల్టీ స్టారర్ తీసే ఆలోచన ఏమైనా ఉందా? అని కూడా ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్నలన్నింటికీ అనిల్ రావిపూడి ఏమని సమాధానం చెప్పాడో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేవరకు చూడాల్సిందే. ఇకపోతే ఆహా వేదికగా ఈ ఎపిసోడ్ డిసెంబర్ 27 శుక్రవారం అనగా రేపు రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే సంక్రాంతి హీరోలు అంటూ ప్రోమో రిలీజ్ చేయగా.. ప్రోమో కూడా ఆద్యంతం ఆకట్టుకుంది.