Trisha : హీరో, హీరోయిన్లు సినిమాలతో పాటుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. కొందరు అధికారంలో ఉన్న పార్టీ కండువాను కప్పుకుంటే మరికొందరు మాత్రం ప్రతిపక్షంలో చేరుతున్నారు. ఇక స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లు, హీరోలు సొంతంగా పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ నాట సినీ ఇండస్ట్రీలో రాజకీయ సెగ ఎక్కువగా ఉంటుంది. స్టార్స్ సొంతంగా పార్టీని పెట్టి రాజకీయాల్లో కి రావాలని అనుకుంటారు. ఇప్పటికే చాలా మంది నటీ నటులు రాజకీయ ప్రవేశం చేశారు. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ తన మనసులోని కోరికను బయటకు పెట్టేసింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. హీరోయిన్ త్రిష.. తాజాగా ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పి బాంబ్ పేల్చింది..
త్రిష ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నది.. ఆమె మాట్లాడుతూ తన మనసులోని మాటలను బయటపెట్టేసింది. ఆమె మాట్లాడుతూ నాకు మొదటి నుండి రాజకీయాల మీద అమితాసక్తి ఉంది. ప్రజలకు సేవ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఈ స్థాయిలో పెట్టిన జనాలకు ఎదో ఒకటి తిరిగి ఇవ్వాలి. అది జరగాలంటే రాజకీయాలతోనే సాధ్యం. ఎదో ఒకరోజు నాకు తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక ఉంది అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.. ఈమె మాటలు వింటుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా ఎమ్మెల్యే గా పోటీ చేసేలాగానే ఉంది. ప్రస్తుతం ఆమె తమిళ హీరో విజయ్ తో డేటింగ్ లో ఉంది అంటూ కొలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అటు హీరో దళపతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మొన్నా ఆ మధ్య కొత్త పార్టీని అనౌన్స్ చేశాడు.. మరి ఆ పార్టీలో కీలక పదవిలో పోటీ చేస్తుందేమో చూడాలి..
ఇక సినీ కేరీర్ విషయానికొస్తే.. తెలుగు ఇండస్ట్రీ కి చెందిన హీరోయిన్, మన తెలుగు అమ్మాయి అని అనుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నిజానికి త్రిష చెన్నై బ్యూటీ ఒక తమిళియన్. అక్కడే ఆమె తన కెరీర్ ని మొదలు పెట్టింది. ఆ తర్వాత తెలుగు లో కూడా అవకాశాలు వచ్చాయి. రెండు భాషల్లోనూ ఈమె సంపాదించినంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా సంపాదించలేదు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది.. త్రిష మాత్రం ఒక్కో సినిమాకి 8 నుండి 10 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఎంతమంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా త్రిష క్రేజ్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. తమిళ్, తెలుగు సినిమాలను చేస్తుంది. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ హీరో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీలో నటిస్తుంది. సమ్మర్ లో మూవీ రిలీజ్ కాబోతుంది.. ఈ మూవీ పై చిరంజీవి ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..