BigTV English

Star Heroines : నిర్మాతలకు భారంగా మారుతున్న హీరోయిన్లు.. వెలుగులోకి నమ్మలేని నిజాలు..

Star Heroines : నిర్మాతలకు భారంగా మారుతున్న హీరోయిన్లు.. వెలుగులోకి నమ్మలేని నిజాలు..

Star Heroines : సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లకు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళు సినిమాల్లో నటించాలంటే డిమాండ్స్ ఓ రేంజులో ఉంటున్నాయి. వారికి సినిమాల్లో నటించేందుకు ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే వారికి కావలసినట్లు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చెయ్యడానికి నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అసలు ఇండస్ట్రీలో హీరోయిన్ల డిమాండ్లతో నిర్మాతలు కొందరు సినిమాలను తీసే ఆలోచనను విరమించుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్.. అయితే హీరోయిన్లు చేసే డిమాండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


భారీ ధరలతో ప్లాట్స్..

సినిమాలో ఒక హీరోయిన్ నటిస్తుంది అంటే ఆ చిత్ర నిర్మాతల చెబులకు చిల్లు పడుతుంది. మూవీలో యాక్ట్ చేసినందుకు రెమ్యూనరేషన్ మొత్తం ముందుగానే వసూల్ చేస్తున్నారు. చెక్ చేతిలో పడితేనే ఆలోచిస్తాం అంటారు లేకుంటే మాత్రం చాలా సినిమాలు ఉన్నాయనో లేదా మరేదో కారణంతో రిజెక్ట్ చేసేస్తున్నారు.. ఇక అంతకన్నా పెద్ద కోరికలు రిచ్ ఏరియాలో లగ్జరీ ప్లాట్స్, లేదా ఈఏంఐ లను కట్టమని డిమాండ్ చేస్తున్నారని కొందరు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..


ముంబై నుంచి మేకప్ ఆర్టిస్టులు కావాలని డిమాండ్..

మేకప్ వెయ్యడానికి తెలుగు రాష్ట్రంలోని మేకప్ ఆర్టిస్టులు సరిపోరట.. ముంబై నుంచి స్పెషల్ మేకప్ లు, హెయిర్ స్టైల్స్ కోసం కావాలని డిమాండ్ చేస్తున్నారు. సినిమా కమిట్మెంట్ కన్నా ముందు ఇవి కావాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు వద్దంటే సినిమాకు నో చెప్పేస్తున్నారు.

లగ్జరీ హోటళ్లలో సూట్ రూమ్‌లు.. 

వేరే రాష్ట్రాల హీరోయిన్లు సినిమాల్లో నటించాలని అంటే కోరికలు కొండేక్కుతున్నాయి.. పది రోజులు షూటింగ్ ఉంటే లగ్జరీ హోటళ్లలో సూట్ రూమ్‌లు బుక్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.. ఆ హోటల్ బిల్లు తడిచి మొపెడు అవుతుంది.. ఇక తమతో పాటు వచ్చినవారికి కూడా ప్రత్యేకమైన రూమ్ ను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట..

హైజెనిక్ ఫుడ్.. 

ఈ మధ్య సినీ హీరోయిన్లు డైట్ ను బాగా ఫాలో అవుతున్నారు.. అయితే డైట్ కోసం సెపరేట్ గా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటున్నారు. అవి ఏమి తక్కువలో వచ్చేవి కాదు. లక్షల్లో బిల్స్ పే చేసేలా చేస్తున్నారు.. హీరోలను మించి ఫుడ్ ను తీసుకోవడంతో నిర్మాతలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.

తమ పర్సనల్ స్టాప్ కోసం ఖర్చు.. 

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న కొందరు హీరోయిన్లు సెక్యూరిటీ, పర్సనల్ మేకప్ ఆర్టిస్టులు, మేనేజర్, డిజైనర్స్ లను ఎప్పుడు తమ వెంట తీసుకొస్తున్నారు. అయితే తమ సిబ్బందిని తమతో కాకుండా ప్రత్యేకంగా వాహనాల్లో తీసుకురావాలని నిర్మాతలకు ముందే చెప్తున్నారు. దానికి అదనంగా ఖర్చులు..

పేరెంట్స్ కు ఫెసిలిటీస్.. 

వేరే రాష్ట్రాల్లోని హీరోయిన్లు సినిమాల్లో నటించాలంటే తమతో పాటుగా పేరెంట్స్ లేదా కజీన్స్ కూడా వస్తారు. వారికి హీరోయిన్లతో పాటుగా అన్ని సౌకర్యాలను కల్పించాలి. ఏది తక్కువైన హర్ట్ అవుతున్నారు.. ఇక కొన్ని రోజులు షూటింగ్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. మళ్లీ నిర్మాతలు కాళ్ల బేరాలు పెడితే దిగోస్తున్నారు..

ఇదండి ఇండస్ట్రీలోని చిత్ర నిర్మాతల పరిస్థితి.. తెలుగు రాష్ట్రాల్లో అందమైన హీరోయిన్లు ఉన్నా కూడా వేరే రాష్ట్రాల అందాల పై మోజుతో హీరోయిన్లను తీసుకొస్తున్నారు. ఇక వారి డిమాండ్స్ ను తీర్చలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. కోరి తెచ్చుకున్న వాటికి కోరికలు ఎక్కువే అట.. సినిమా పూర్తి అవ్వాలంటే కోరికలకు తల వంచక తప్పట్లేదు అదన్నమాట ఇండస్ట్రీలోని పరిస్థితి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×