
Hi Nanna movie Update : నాచురల్ స్టార్ నాని.. మృణాల్ ఠాకూర్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ హాయ్ నాన్న. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్ ,టీజర్ ,సాంగ్స్ అంచనాలను భారీగా పెంచాయి. ఈ మూవీలో ప్రతి సాంగ్ ఒక మెస్మరైజింగ్ మ్యూజికల్ హిట్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. నాని కెరియర్ లో 30వ చిత్రం పై మంచి పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. డిసెంబర్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం పట్ల మేకర్స్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
తండ్రి కూతుర్ల సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి .కానీ హాయ్ నాన్న మూవీ వీటికి కాస్త భిన్నంగా ఉంటుంది అని టాక్.ఈ మూవీలో ఎమోషన్స్ హైలైట్ గా నిలుస్తాయట. అనుకున్న దానికి మించి ఈ చిత్రం ప్రతి ఒక్కరి మనసును ఎమోషనల్ గా టచ్ చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది నాని కెరియర్ లోని ఒక చెరిగిపోని ఎమోషనల్ మూవీగా నిలబడుతుందట.
పాన్ ఇండియా విడుదలవుతున్న ఈ చిత్రం లో తండ్రి కూతుర్ల సెంటిమెంట్ తో పాటు భార్యా భర్తల స్వీట్ జర్నీ ని కూడా బాగా హైలైట్ చేస్తారు అన్న విషయం రీసెంట్ గా విడుదలైన సాంగ్స్ లో క్లియర్ గా అర్థమైంది.ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నది కొత్త డైరెక్టర్ శౌర్యువ్ ..అయినప్పటికీ అతను ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు అని తెలుస్తోంది.
ఇప్పటికే మూవీ టీజర్ ,సాంగ్స్ ద్వారా మేకప్ చిత్రంపై కాస్త క్లారిటీ తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కథ రొటీన్ గా కనిపిస్తున్న కథనం భిన్నంగా ఉంది. ఒక తండ్రి.. అతను ప్రాణంగా పెంచుకుని కూతురు. వారి ఇద్దరి చిన్న ప్రపంచంలోకి కూతురు ద్వారా పరిచయమైన అమ్మాయి ఎంట్రీ. ఆ ముగ్గురు మధ్య అనుకోకుండా ఏర్పడిన బంధం. చివరికి ఆ బంధాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్లాలి అనే విషయంలో ఎదురయ్యే కన్ఫ్యూజన్ మధ్యలో హీరోయిన్ కి వేరొకరితో ఎంగేజ్మెంట్.. ఫైనల్ గా ఒకటైన హీరో హీరోయిన్. ఇప్పటివరకు మనకు అర్థమైన స్టోరీ ఇది. మరి ఇందులో ట్విస్ట్ ఏ రేంజ్ లో ఉన్నాయో మూవీ రిలీజ్ అయితే కానీ తెలియదు.