BB Telugu 8 Promo..తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss). ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు పూర్తిచేసుకుని ఒక ఓటీటీ నాన్ స్టాప్ వెర్షన్ కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు 8వ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 15 అనగా ఆదివారం రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఏడెకరాలలో భారీ సెట్ వేసి షో నిర్వహిస్తున్నారు. ఇక అదే రోజు అక్కడ గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. అంతేకాదు ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ (Allu Arjun) చీఫ్ గెస్ట్ గా వస్తారని అందరూ అనుకున్నారు . కానీ ఆయన ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. అంతేకాదు 14 రోజులపాటు జైలు జీవితం కూడా గడపనున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ కి చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనే సందిగ్ధత ఏర్పడింది.
ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆరవ వారం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ను ఎనిమిది మందిని వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి తీసుకొచ్చారు బిగ్ బాస్.అలా మొత్తం 22 మందితో హౌస్ రసవత్తరంగా సాగింది. నువ్వా నేనా అంటూ కంటెస్టెంట్స్ కూడా టాస్క్ విషయంలో పోటీపడి మరీ ఎవరికి వారు తమ స్ట్రాటజీ నిరూపించుకున్నారు. ఇన్ఫినిటీ అంటూ వచ్చిన ఈ సీజన్ ఆడియన్స్ కు వినోదాన్ని పంచడంలో సక్సెస్ అయ్యింది. ఇకపోతే ప్రతి సీజన్లో కూడా విన్నర్ ఎవరో ముందే తెలిసిపోతుంది. కానీ ఈ సీజన్లో మాత్రం అలా జరగడం లేదు. వాస్తవానికి వైల్డ్ కార్డు ద్వారా గౌతమ్ ఎంట్రీ ఇచ్చినా.. తన ఆట తీరుతో అందరి హృదయాలు దోచుకున్నారు. మరొకవైపు నిఖిల్ టైటిల్ విన్నర్ గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరికి వారు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు కానీ ఓట్లు కూడా ఇద్దరికీ చాలా తక్కువ తేడాలో నమోదవుతున్నాయి. మరి ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
ఇకపోతే ప్రస్తుతం టాప్ ఫైవ్ లో అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ మాత్రమే ఉన్నారు. ఈ 5 మందికి సంబంధించిన జర్నీలను ఒక్కో రోజు ఇద్దరు చొప్పున జర్నీ వేస్తున్నారు బిగ్ బాస్. అందులో భాగంగానే ఉదయం నిఖిల్ జర్నీ వేసి అందరినీ మెప్పించిన బిగ్ బాస్ , ఇప్పుడు ప్రేరణ జర్నీ వేసి కంటతడి పెట్టించారు. సాధారణంగా బిగ్ బాస్ కి ఎమోషన్స్ ఉండవు. అలాంటిది ప్రేరణ విషయంలో పొగడ్తలు చూపించేసరికి బిగ్ బాస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రేరణ హౌస్ లో ఆడిన తీరుకి బిగ్ బాస్ సైతం ఫిదా అయ్యారు. పసిపాప లాంటి అమాయకత్వంతో ఇంట్లోకి మీరు అడుగుపెట్టిన తీరు అందరిని దగ్గరకు చేసింది. పెళ్లి దేనికి అడ్డు కాదని, పెళ్లయిన మహిళలు కూడా ఎంతో సాధించొచ్చు అని మీ ప్రయాణంతో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తారని అనుకుంటున్నాం అంటూ తెలిపారు బిగ్ బాస్. బిగ్బాస్ ఇంట్లో మీరు ఫస్ట్ బెంచ్.. మీరు మెగా చీఫ్ కాదు బెస్ట్ చీఫ్ అంటూ ప్రేరణపై పొగడ్తలు కురిపించారు బిగ్ బాస్. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.