Thandel Song: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బుజ్జితల్లి సాంగ్ అయితే సెన్సేషన్ సృష్టిస్తున్న విషయం తెల్సిందే. ఇక వాలెంటైన్స్ డే స్పెషల్ గా తండేల్ ఫిబ్రవరి 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్..ఈ సినిమాలోని లిరికల్ సాంగ్స్ తో పాటు వీడియో సాంగ్స్ ను కూడా రిలీజ్ చేసి ఇంకా హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. హైలేస్సో హైలెస్సా అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. “ఎంతంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ వున్నా అసలెంత అలుపే రాదు.. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన వున్నా కాస్తయినా అడ్డే కాదు” అంటూ మొదలైన ఈ సాంగ్ అద్భుతంగా ఉంది. శ్రీమణి లిరిక్స్ ఎంతో అర్థవంతంగా వినిపిస్తున్నాయి.
Colours Swathi: భర్తకు విడాకులు ఇచ్చిన కలర్స్ స్వాతి.. ఇదిగో సాక్ష్యం.. ?
ఇక వింటేజ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చెవులకు ఎంతో వినసొంపుగా అనిపిస్తుంది. సాంగ్, మ్యూజిక్ అంతా ఒక ఎత్తు అయితే.. శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ మెస్మరైజ్ వాయిస్ వేరే లోకానికి తీసుకెళ్లిపోతుందని చెప్పొచ్చు. ఇక వీడియోలో చైను మరోసారి సాయిపల్లవి డామినేట్ చేసేసింది. ఆమె హుక్ స్టెప్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
లవ్ స్టోరీలో ఏవో ఏవో కలలే సాంగ్ లో నెమలిలా ఎలా అయితే డ్యాన్స్ వేసిందో.. ఇందులో కూడా అలానే నెమలిలా మెలికలు తిరిగేసింది. ఇద్దరు ప్రేమికుల మనసులో ఉండే ప్రతి భావం.. ఈ సాంగ్ లో కనిపిస్తుంది. చై , సాయిపల్లవి దూరంగా ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడుకోవడం.. దగ్గరగా ఉన్నప్పుడు కబుర్లు చెప్పుకోవడం, ఇద్దరు కలిసి సముద్రపు ఒడ్డున ఆటలు ఆడడం.. ఇలాంటి విజువల్స్ ఎంతో ప్రత్యేకంగా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.
దేవిశ్రీ మ్యూజిక్ ఈ మధ్యకాలంలో అంతగా ఆకట్టుకోవడం లేదనే పేరు వినిపిస్తుంది. ఈ తండేల్ ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా మారి.. మరోసారి దేవిశ్రీ పేరును మారుమ్రోగేలా చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఈ జంట ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.