Sudigali Sudheer: బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ హీరో సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా కమెడీయన్ గా పరిచయమై అతి తక్కువ కాలంలోనే టీమ్ లీడర్ అయ్యాడు. తన స్కిట్లతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సుధీర్ సినిమాల్లోకి కమెడియన్గా ఎంట్రీ ఇచ్చాడు. ఒక్క సినిమా తో తన టాలెంట్ నిరూపించుకుంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీతోనే మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఆయన హోస్ట్గా వ్యవహరిస్తున్న షోలో దేవుడిని కించపరిచారు అంటూ హిందువులు సుధీర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ షో ఏంటి? అసలు జరిగిన మ్యాటర్ ఏంటో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సుధీర్ పై హిందువులు ఆగ్రహం..
సుడిగాలి సుదీర్ ఒకవైపు సినిమాలు, మరోవైపు షోలకు హోస్టుగా వ్యవహారిస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే రెండు చేతులు సంపాదిస్తూ వస్తున్నాడు.. తాజాగా ఈయన ప్రముఖ ఓ షోకి హోస్ట్ గా చేస్తున్నారు.. ఆ షోలో పాల్గొన్న సుడిగాలి సుధీర్ స్టేజిపైకి నందీశ్వరుడి విగ్రహాన్ని తీసుకొచ్చి.. నందీశ్వరుడి తలపై భాగం నుంచి శివుడిని చూసినట్లుగా.. సుధీర్.. నటి రంభను చూశాడు. వెనకాలే ఉన్న రవి.. ఏంటి బావ స్వామివారు దర్శనం అయ్యారా అనగా.. నాకేంటి అమ్మోరు దర్శనం అవుతోంది అంటూ రంభను ఉద్దేశించి సుధీర్ అంటాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు సుధీర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులు సుధీర్ ని కొంచమైనా బుద్ధి లేదా దేవుడితో పరాచకాలు ఏంటి అంటూ కామెంట్లతో మండిపడుతున్నారు. మొత్తానికి ఆ వీడియో అయితే ప్రస్తుతం విమర్శలను అందుకుంటుంది. మరి దీనిపై షో నిర్వాహకులు గానీ, సుధీర్ గానీ రెస్పాండ్ అవుతారు ఏమో చూడాలి..
Also Read : నటుడు సప్తగిరి ఇంట తీవ్ర విషాదం.. మాతృవియోగం..
సుధీర్ గురించి ఆసక్తికర విషయాలు..
తెలుగు నటుడు సుధీర్ ఈ పేరు అందరికీ సుపరిచితమే.. ఈయన ఆంధ్రప్రదేశ్ విజయవాడ జిల్లాలో జన్మించారు. మొదట్లో మేజీషియన్ గా అనేక షోలలో తన మ్యాజిక్ తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇంటర్మీడియట్ వారికి చదివిన సుధీర్ నటన వైపు ఆసక్తి పెరగడంతో అటుగా అడుగులు వేస్తూ హైదరాబాద్కు వచ్చేసాడు.. సిటీ కేబుల్ విజయవాడలో ప్రసారం చేసిన టాలెంట్ షో కోసం సుధీర్ తన మొదటి టెలివిజన్ ప్రదర్శనలో పాల్గొన్నాడు. తన ఇంటర్మీడియట్ సమయం లో, అతను మా టీవీలో ప్రసారమైన స్టార్ హంట్ వన్ ఛాన్స్ షో లో కనిపించాడు.. ఆ తర్వాత దూరదర్శన్ ఛానల్లో పనిచేశారు. జబర్దస్త్ లో అడుగు పెట్టాడు. ఎక్కడ తన టాలెంట్ తో స్టార్ కమెడియన్ గా అనే గుర్తింపును తెచ్చుకొని ప్రస్తుతం సినిమా ల్లో హీరోగా పలు కీలక పాత్రలో నటిస్తున్నాడు.. బుల్లితెర పై షోలకు హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు.