ప్రయాణీకులను ఆకర్షించేందుకు హైదరాబాద్ మెట్రో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రత్యేక సందర్భాలకు అనుగుణంగా రైళ్ల టైమింగ్స్ మార్చడంతో పాటు క్రేజీ ఆఫర్లు, స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తున్నది. రెగ్యులర్ గా మెట్రోలో ప్రయాణించే ప్యాసింజర్లకు మరో క్రేజీ డిస్కౌంట్ ను అందిస్తున్నది. నాన్ పీక్ అవర్స్ లో టికెట్ రేటుపై తగ్గింపు అందిస్తోంది.
ఆఫ్ పీక్ సమయాల్లో 10% డిస్కౌంట్
రాత్రి 8 గంటల తర్వాత సహా కొన్ని ఆఫ్ పీక్ అవర్స్ లో ప్రత్యేక డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది హైదరాబాద్ మెట్రో. తక్కువ రద్దీ సమయాల్లో ఎక్కువ మంది మెట్రో సేవలను ఉపయోగించుకోవడంతో పాటు మెట్రో ప్రయాణాన్ని మరింత చౌకగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో ఆఫ్ పీక్ సమయాల్లో ఉపయోగించేలా కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డులు ఉన్న వాళ్లు రాత్రి 8 తర్వాత ప్రయాణిస్తే టికెట్ ఛార్జీపై 10% డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది.
ఆఫ్ పీక్ అవర్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
ఉదయం 6 నుంచి ఉదయం 8 వరకు, రాత్రి 8 నుంచి 12 వరకు నాన్ పీక్ అవర్స్ గా హైదరాబాద్ మెట్రో గుర్తించింది. రాత్రి 8 గంటల తర్వాత ప్రయాణించాలని ప్లాన్ చేస్తే, ఈ 10% డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ టికెట్ల కోసం కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డులను ఉపయోగించే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
సూపర్ సేవర్ ఆఫర్ 99
రద్దీ లేని సమయాల్లో 10% తగ్గింపుతో పాటు హైదరాబాద్ మెట్రో సూపర్ సేవర్ ఆఫర్-99 పేరుతో మరో అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ కేవలం రూ.99కే అపరిమిత ప్రయాణాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఏడాది పొడవునా 100 సెలవు దినాల్లో కేవలం రూ.99తో ప్రయాణించవచ్చు. హాలీడే రోజు తరచుగా ప్రయాణించడం, లేదంటే రవాణా ఖర్చులను ఆదా చేసుకునేందుకు ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవచ్చు.
ఈ ఆఫర్లను ఎలా పొందాలంటే?
ఈ ఆఫర్లను పొందడానికి కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. ఈ కార్డులు ప్రతి మెట్రో స్టేషన్ లో లభిస్తాయి. ఈ స్మార్ట్ కార్డ్‌ను పొందిన తర్వాత ఆఫ్ పీక్ సమయాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల దగ్గర స్వైప్ చేయాలి. అప్పుడు 10% తగ్గింపు అనేది ఆటోమేటిక్ గా లభిస్తుంది. టికెట్ కౌంటర్ దగ్గర నిలబడే శ్రమ కూడా తప్పుతుంది.
Read Also: సముద్రం పక్క నుంచి వెళ్లే ఈ రైల్ రూట్స్ ఇండియాలో ఎక్కడున్నాయో తెలుసా?
ఈ స్పెషల్ ఆఫర్లు ఎందుకంటే?
హైదరబాద్ మెట్రో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ డిస్కౌంట్లు కేవలం డబ్బు ఆదా చేయడం గురించి మాత్రమే కాదు. తక్కువ రద్దీ సమయాల్లో ఎక్కువ మంది ప్రయాణించేలా ఉపయోగపడనున్నాయి. ప్రజలను ఆఫర్ల పేరుతో ప్రోత్సహించడం ద్వారా మెట్రోకు లాభం కలిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రయాణీకులకు ప్రయాణ ఖర్చులు తగ్గనున్నాయి.
Read Also: జపాన్ 6 గంటల్లో 3D-ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ను ఎలా నిర్మించింది!