BigTV English

Women Beaten For English: ‘ఎక్స్‌కూజ్ మీ’ అన్నందుకు మహిళలను చితకబాదిన జనం.. మాతృభాషలో మాట్లాడకపోతే అక్కడ అంతే

Women Beaten For English: ‘ఎక్స్‌కూజ్ మీ’ అన్నందుకు మహిళలను చితకబాదిన జనం.. మాతృభాషలో మాట్లాడకపోతే అక్కడ అంతే

Women Beaten For English| ఇద్దరు మహిళలు రోడ్డుపై వెళుతూ ఇంగ్లీషులో మాట్లాడారు. వారు చేసిన అతిపెద్ద తప్పు అదే. పక్క నుంచి వెళుతున్న కొంతమంది వారిని మాతృభాషలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దీంతో ఆ మహిళలు వారితో తాము చేసిన తప్పేంటని ఎదురు మాట్లాడారు. అంతే ఆ వాగ్వాదం కాస్తా హింసాత్మకంగా మారింది. ఆ మహిళలను జనం చితకబాదారు. ఈ ఘటన భారత దేశం ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ముంబైలోని థానె ప్రాంతం డొంబివలి సమీపంలో జూనిలో రెండు రోజుల క్రితం రాత్రి వేళ ఇద్దరు యువతులు స్కూటీపై వెళుతున్నారు. వారిలో ఒకరు చంటిపాపను ఎత్తుకొని ఉన్నారు. అయితే దారిలో ఎదరుగా ముగ్గురు పురుషులు వెళుతుంండగా.. అడ్డంగా ఉన్నారు. దాంతో ఆ స్కూటీ నడిపే యువతి వారిని పక్కకు తప్పుకోమని చెప్పేందుకు ‘ఎక్స్‌కూజ్ మీ’ అని చెప్పింది. ఆ తరువాత వారికి ఆ రాత్రి పెద్ద సమస్యగా మారింది. ఆ ముగ్గురు పురుషులు ఆ యువతులపై కోపడ్డారు. ఇంగ్లీషులో మాట్లాడడం ఏంటి? అని గొడవ చేశారు. దీంతో ఆ యువతులు కూడా ఇంగ్లీషులో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. ఆ వాగ్వాదం గొడవగా మారింది. ఆ పురుషులు యువతుల జుట్టు పట్టుకొని ఈడ్చారు. యువతులను కొట్టారు.

దీంతో బాధిత యువతులు ఆ పురుషులను తోయడం ప్రారంభించగా.. పక్కనే ఆ పురుషుల ఇళ్లు ఉండడంతో వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఆ మహిళలు కూడా తమ మాతృభాష మరాఠీలోనే మాట్లాడాలి అని చెబుతూ చితకబాదారు.


Also Read: మహిళా ఎంపీ కోసం ఒకరినొకరు తిట్టుకున్న టిఎంసీ ఎంపీలు.. వీడియోలు వైరల్ చేసిన బిజేపీ

ఈ ఘటన తరువాత ఇద్దరు బాధిత యువతులు స్థానికంగా ఉన్న విష్ణు నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ముగ్గురు పురుషులు అనిల్ పవార్, బాబా సాహెబ్ ధూబ్లే, నితేళ్ ధూబ్లే లపై ఫిర్యాదు చేశారు. తాము నివసించే పాత డోంబివలీ ప్రాంతంలోని జూని హౌసింగ్ సొసైటీలో నిందితులు ముగ్గురు కూడా నివసిస్తున్నారని.. రాత్రి వేళ స్కూటీలో వెళుతున్నప్పుడు అడ్డుగా ఉండడంతో వారిని ఇంగ్లీషులో కాస్త తప్పుకోమన్నందుకు తమను కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వద్ద ఒక చంటి పాప ఉందని తెలిసి కూడా తమపై ఆ ముగ్గురు పురుషులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా దాడి చేశారని పోలీసులకు చెప్పారు. అయితే పోలీసులు విచారణ చేస్తున్నామని తెలిపారు.

ఇలాంటి చేదు అనుభవమే.. కొన్ని రోజుల క్రితం ఒక సెక్యూరిటీ సిబ్బందికి ఎదురైంది. తాను మరాఠీలో మాట్లాడేది లేదని ఆ సెక్యూరిటీ గార్డు సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టడంతో ఎంఎన్ఎస్ పార్టీ కార్యకర్తలు అతనిపై దాడి చేశారు.

మహారాష్ట్రలో ఇప్పుడు మతం, భాషా రాజకీయాలు జరుగుతున్నాయి. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార బిజేపీ, రాజ్ ఠాక్రే కు చెందిన ఎంఎన్ఎస్ పార్టీలు భాష, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం నాగ్ పూర్ లో హిందూ, ముస్లిం అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత గత వారం ఎంఎన్ఎస్ పార్టీ (MNS party) కార్యకర్తలు మహారాష్ట్రంలో బతికే ఇతర రాష్ట్ర ప్రజలు కూడా మరాఠీనే (Marathi) మాట్లాడాలి అని దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకులలో బలవంతంగా ప్రవేశించి అందరూ మరాఠీనే మాట్లాడాలి అని బెదరింపులు చేస్తున్నట్లు సమాచారం.

దీంతో బ్యాంకు సిబ్బంది సంఘం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కు ఫిర్యాదు చేశారు. ఎంఎన్ఎస్ కార్యకర్తలు బ్యాంకులలో ప్రవేశించి తమకు బెదిరిస్తున్నారని చెప్పారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని సిఎం ఫడణవీస్ హామీ ఇచ్చారు. ఈ ఘటన తరువాత ఎంఎస్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే తమ పార్టీ కార్యకర్తలను సంయమనం పాటించాలని చెప్పారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×