OTT Movie : వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు విచ్చిన్నం అవుతాయి. భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి వస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో, ఈ మూవీలో చూపించారు. ఒక సాధారణ వ్యక్తి ఇటువంటి వాటిల్లో ఇరుక్కుంటే బయటకు రావడం చాలా కష్టమే. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ మూవీలో, హీరో ఒక మహిళ ట్రాప్ లో పడతాడు. ఆ తర్వాత అతన్ని బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బంది పెడుతుంటారు. వీటిని అతడు ఎలా ఎదుర్కొంటాడో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డీరైల్డ్’ (Derailed). ఈ మూవీ జేమ్స్ సీగెల్ రాసిన నవల ఆధారంగా, మైకెల్ హాఫ్‌స్ట్రోమ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో క్లైవ్ ఓవెన్, జెన్నిఫర్ అనిస్టన్, విన్సెంట్ కాసెల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ చార్లెస్ షైన్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. లుసిండా హారిస్ అనే మహిళ చార్లెస్ జీవితంలోకి రావడంతో,అతను ఇబ్బందుల్లో పడతాడు. డీరైల్డ్ 2005 లో యునైటెడ్ స్టేట్స్‌లో థియేట్రికల్‌గా విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాడంబరమైన విజయాన్ని అందుకుంది. 32 మిలియన్ల బడ్జెట్ తో తెరకెక్కగా, 57 మిలియన్లు వసూలు చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
చార్లెస్ షైన్ ఒక సాధారణ వ్యాపారవేత్తగా ఉంటూ, తన భార్య కుమార్తెతో చికాగోలో నివసిస్తుంటాడు. అతని కుటుంబం ఆర్థిక పరిస్తితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కుమార్తెకు డయాబెటిస్ ఉండటం వల్ల అతను చాలా బాధపడుతుంటాడు.కూతురు వైద్యం కోసం కొంత డబ్బులు కూడా సర్దుతూ ఉంటాడు. భార్యతో కలసి సరదాగా కూడా గడపలేని పరిస్తితి ఉంటుంది. ఒక రోజు ఉదయం ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు, అతను లూసిండా అనే ఒక అందమైన మహిళను కలుస్తాడు. ఇద్దరికీ వివాహం అయినప్పటికీ, వారి మధ్య స్నేహం ఏర్పడి అది త్వరలోనే ఒక వ్యవహారంగా మారుతుంది. వాళ్ళిద్దరూ ఒక రాత్రి హోటల్ లో గడుపుదామని ప్లాన్ వేస్తారు. భార్యతో కూడా కలసి చాలా రోజులు అవుతుండటంతో, హోటల్లో రెచ్చిపోవాలి అనుకుంటాడు చార్లెస్. వీళ్ళు గదిలో మంచి మూడ్ లో ఉండగా, ఫిలిప్ లారోష్ అనే ఒక దుండగుడు గదిలోకి చొరబడి వారిపై దాడి చేస్తాడు.
చార్లెస్, లూసిండాపై దాడి చేసి వారి డబ్బును దోచుకుంటాడు లారోష్. తమ వ్యవహారం బయటపడుతుందనే భయంతో వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయకుండా సైలెంట్ గా ఉంటారు. ఆ తర్వాత లారోష్, చార్లెస్‌ను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభిస్తాడు. చార్లెస్ ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అనేక ట్విస్ట్‌లతో ఒక పెద్ద రహస్యం తెలుసుకుంటాడు. లూసిండా అనే మహిళ నిజంగా లారోష్‌తో కలిసి పనిచేసే స్కామర్. వారు కలిసి చార్లెస్‌ను ఒక పక్కా ప్లాన్ చేసి దోచుకుంటారు. చార్లెస్ ఈ కుట్రను గుర్తించి, వాళ్ళకు బుద్ధి చెప్పాలనుకుంటాడు. చివరికి లారోష్‌ను చార్లెస్ ఎలా ఎదుర్కుంటాడు? తన కుటుంబాన్నిఎలా కాపాడుకుంటాడు? చార్లెస్ తన సాధారణ జీవితానికి తిరిగి వస్తాడా? ఈ విషయాలు మాత్రం ఈ మూవీని చూసి తెలుసుకోండి.