BigTV English

Hit 3 Collections : షాకిచ్చిన ‘హిట్ 3’ కలెక్షన్స్.. మరి ఇంత డౌన్ అయ్యాయేంటి..?

Hit 3 Collections : షాకిచ్చిన ‘హిట్ 3’ కలెక్షన్స్.. మరి ఇంత డౌన్ అయ్యాయేంటి..?

Hit 3 Collections : టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ చిత్రం హిట్ 3.. మే 1 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. నాని బ్లడ్ బాత్ కాసుల వర్షం కురిపిస్తుంది. ఫస్ట్ డే 43 కోట్లు రాబట్టింది. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయె తప్ప తగ్గట్లేదు. మరి ఆరు రోజులకు నాని మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూసేద్దాం..


హిట్ 3 కలెక్షన్స్.. 

గత కొన్నేళ్లుగా నాని నటిస్తున్న సినిమాలు బాక్సాఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఒక్కో మూవీ టాలీవుడ్ లోని వరుస రికార్డు లను బ్రేక్ చేస్తుంది. సరిపోదా శనివారం మూవీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.. ఇప్పుడు వచ్చిన హిట్ 3 మూవీ కూడా అదే రేంజ్ లో టాక్ ను అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వరద పొంగుతుంది. మొదటి రోజు 43 కోట్లు, రెండో రోజు 63 కోట్లు, మూడో రోజు కూడా ఏ మాత్రం తగ్గలేదు. మొత్తం 82 కోట్లు వసూల్ చేసింది. ఇక నాల్గోవ రోజు కూడా మరో 20 కోట్లు వసూల్ చేసింది. వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఐదో రోజు ఓపెనింగ్స్ బాగా జరగడంతో 122 కోట్ల వరకు రాబట్టింది. ఇక ఆరోవ రోజు కలెక్షన్స్ కాస్త డౌన్ అయ్యాయని తెలుస్తుంది. మొత్తం కలిపి 130 కోట్లకు పైగా రాబట్టిందని సమాచారం. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏమి లేకపోవడంతో ఈ మూవీ కలెక్షన్స్ అటు ఇటు అయినా కూడా మంచిగానే వసూళ్లు వస్తాయని నాని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.


హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్..

నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్.. ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ అయ్యిందని టాక్. అలాగే బిజినెస్ కూడా బాగానే జరిగింది. నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్‌ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల వరకు జరిగిందని తెలుస్తుంది.

గతంలో వచ్చిన హిట్ మూవీకి సీక్వెల్ హిట్ 2 వచ్చింది.. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. దానికి కొనసాగింపుగా నాని, శైలేష్ కొలను కాంబోలో లో హిట్ 3 మూవీ వచ్చింది. ఇందులోకేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని హిట్ 3ని నిర్మించారు.. ఇకపోతే హిట్ 4 కూడా ఉండబోతుందని గతంలో ప్రకటించారు. దాని పై కూడా నెట్టింట అప్పుడే చర్చలు మొదలయ్యాయి. చూడాలి ఆ మూవీ ఎలా ఉంటుందో..

ఇక నాని ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ ను తన అకౌంట్ లో వేసుకున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల తో ది ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు.. ఈ ఏడాదిలో మూవీ రాబోతుందని సమాచారం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×