BigTV English

TGSRTC Bus: ఆర్టీసీ బస్సుల్లో కల్లు తీసుకెళ్లకూడదా? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

TGSRTC Bus: ఆర్టీసీ బస్సుల్లో కల్లు తీసుకెళ్లకూడదా? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

TGSRTC Rules: తాజాగా నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఓ మహిళ ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. కట్టంగూరులో జరుగుతున్న ఓ వేడుక కోసం కల్లు తీసుకెళ్లాలని భావించింది. కానీ, బస్సులో కల్లు తీసుకువెళ్లకూడదని సదరు బస్సు కండక్టర్, డ్రైవర్ అడ్డుకోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. బస్సులో కల్లు తీసుకెళ్లకూడదని ఎక్కడ రాసి ఉందో చెప్పాలంటూ బస్సు ముందు నిలబడని ఆందోళన చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ ఘటనపై నెట్టింట పెద్ద మొత్తంలో చర్చ జరిగింది. కొందరు పాజిటివ్ గా స్పందిస్తే మరికొంత మంది నెగెటివ్ గా స్పందించారు. కల్లు అనేది తెలంగాణలో ఓ సంస్కృతి అని, దాన్ని మద్యంగా పరిగణించకూడదని కొంత మంది అంటుండగా, బస్సుల్లో తీసుకెళ్లేందుకు అనుమతించడం మంచిదికాదని మరికొంత మంది వాదిస్తున్నారు.


ఆర్టీసీ రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం ప్రజా రవాణాలో మద్యం, కల్లుతో పాటు మరికొన్ని రకాల నిషేధిత వస్తువులను తీసుకెళ్లడం నేరం. కల్లుకు తెలంగాణలో సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. చట్టానికి లోబడి వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి నల్లగొండ బస్ డిపో రీజనల్ మేనేజర్ జానిరెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ప్రజా రవాణాలో ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించకుండా, వారికి సరైన భద్రత కల్పించేలా పలు నియమాలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.


బస్సులో తీసుకెళ్లకూడని వస్తువులు

ఆర్టీసీ బస్సులలో పలు రకాల వస్తువులను తీసుకెళ్ల కూడదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నిషేధిత వస్తుల జాబితాను వెల్లడించారు నల్లగొండ డిపో రీజినల్ మేనేజర్ జానిరెడ్డి. బస్సులలో కల్లు, మద్యం, గ్యాస్ సిలిండర్ లాంటి పేలుడు వస్తువులు, పచ్చిమాంసం, పెంపుడు జంతువులను తీసుకెళ్లకూడదన్నారు. కాదని ఎవరైనా తీసుకెళ్తూ పట్టుబడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

ఆర్టీసీ అధికారుల వివరణపై నెటిజన్ల నుంచి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. మిగతా వస్తువుల విషయంలో ఎలా ఉన్నా కల్లు విషయంలో ఆలోచన మార్చుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణలో కల్లును మద్యంగా ఎవరూ భావించరని, అదో సంస్కృతిగా పరిగణిస్తారు అభిప్రాయపడుతున్నారు. కల్లు తీసుకెళ్లడం వల్ల ప్రయాణీకులు భద్రతకు ముప్పు కలిగే అవకాశం లేదంటున్నారు. తెలంగాణ ఆర్టీసీ తన నియమాలను సమీక్షించి సాంస్కృతిక ఆచారాలకు కొంత మినహాయింపు ఇవ్వాలని సూచిస్తున్నారు. కల్లు తీసుకెళ్లొద్దంటూ మహిళను దింపిన ఆర్టీసీ అధికారులు, సీటింగ్ కెపాసిటీకి మించి జనాలను ఎక్కించుకుని వారి ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నప్పుడు భద్రత గురించి ఆలోచన రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. రూల్స్ గురించి మాట్లాడే ముందు, తాము ఎంత చక్కగా రూల్స్ పాటిస్తున్నామో గుర్తు చేసుకోవడం మంచిదంటున్నారు. మొత్తంగా తెలంగాణలో ఈ కల్లు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.

Read Also: స్పెయిన్ లో అర్ధరాత్రి అలజడి.. రైళ్లలోనే ప్రయాణీకులు బంధీ, అసలు ఏమైంది?

Related News

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Big Stories

×