Bollywood:సినీ సెలబ్రిటీలు సినిమాల ద్వారా, వివిధ వ్యాపార రంగాల ద్వారా సంపాదించిన డబ్బును ఆస్తులు కొనుగోలు చేయడానికి కేటాయిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా లగ్జరీ ఇల్లు, కార్లు, విలాసవంతమైన భవనాలు, ప్రైవేట్ జెట్ ఇలా అన్నింటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలా ఆస్తులు కొనుగోలు చేసే వారిలో క్రికెటర్లు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు లాంటివారు ఎప్పుడు ప్రథమ స్థానంలోనే ఉంటారు. అయితే ఇప్పుడు ట్రెండు మారింది. ఆస్తులు ఏ రూపంలో కొనుగోలు చేస్తున్నారు అనేది ప్రధానంగా మారింది. ఇక ఇప్పుడు తాజాగా డబ్బున్న వ్యాపారస్తులు కోట్లు పెట్టి చిన్న చిన్న ఐలాండ్స్ ను సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ బ్యూటీ కూడా సొంతంగా ఐలాండ్ కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
దీవిని కొన్న బాలీవుడ్ బ్యూటీ..
ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ, స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez). శ్రీలంకకు చెందిన ఈమె బాలీవుడ్లో హీరోయిన్ గా పలు సినిమాలు చేస్తూ.. అటు స్పెషల్ సాంగ్స్ తో పాటు ఇటు కీలక పాత్రలతో కూడా బిజీగా మారిపోయింది. ఇక ఈమెకు బాలీవుడ్ లో మంచి స్టార్ స్టేటస్ కూడా లభించింది. అటు తన క్రేజ్ కి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటోంది జాక్వెలిన్. ఇకపోతే ఈమె గతంలో 2012లో తన దేశమైన శ్రీలంకకు దగ్గరగా ఉన్న ఒక దీవిని కొనుగోలు చేసింది. శ్రీలంకకు దక్షిణ భాగంలో ఉన్న నాలుగు ఎకరాల చిన్న దీవి అది. 2012లో అప్పటి లెక్కల ప్రకారం సుమారుగా రూ.3.5 కోట్లతో దీనిని కొనుగోలు చేసింది. ఇక ఈ దీవిలో ఒక ఖరీదైన విల్లాను కడతానని, అక్కడే సెటిల్ అవుతానని గతంలో చెప్పుకొచ్చింది జాక్వెలిన్. మరి నాడు చెప్పిన మాట నిలబెట్టుకుందా అనే విషయం మాత్రం తెలియలేదు. ఈమె కొన్న దీవిలో విల్లా కట్టిందా.. ?ఆ దీవికి జాక్వెలిన్ వెళ్తుందా? అనేది ఇప్పుడు ప్రశ్నగానే మిగిలింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలి అంటే జాక్వెలిన్ లేదా ఆమె టీం స్పందించే వరకు ఆగాల్సిందే.
ALSO READ; Akhanda 2: బాలయ్య మూవీలో ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్ కూతురు.. ఇది కదా కావాల్సింది..!
జాక్వెలిన్ కెరియర్..
జాక్వెలిన్ విషయానికి వస్తే.. శ్రీలంకకు చెందిన ఈమె పలు రియాల్టీ షోలు, మ్యూజిక్ వీడియోలలో కనిపించడంతోపాటు బాలీవుడ్లో పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సిడ్ని విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్ లో పట్టా భద్రురాలై, శ్రీలంకలో టెలివిజన్ రిపోర్టర్ గా పనిచేసిన ఈమె.. మోడలింగ్ రంగంలోకి చేరిన తర్వాత 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా కిరీటాన్ని ధరించింది. ‘అలాడిన్’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయమైన ఈమె.. ఈ సినిమాతో స్టార్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్ గా ఐఫా అవార్డు సొంతం చేసుకుంది.
ఇక ఈమెకు ‘మర్డర్ 2’ సినిమా మంచి విజయాన్ని అందించింది. అంతేకాకుండా ఇటు కమర్షియల్ పరంగా కూడా మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ లలో కూడా అలరిస్తోంది.