OTT Movie : సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లు అదిరిపోయే ట్విస్ట్ లతో ఆకట్టుకుంటాయి. అయితే సూర్య కిరణాలు ఎంత డేంజర్ అంటే… ఎండా కాలంలో వడదెబ్బతో కొంతమంది చనిపోవడం గుర్తొస్తుంది మనకు. కానీ సూర్య కిరణాలు పడితేనే చచ్చిపోవడం అనే కాన్సెప్ట్ కొంతవరకు భయంకరంగా, మరికాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తెలుగులో నిఖిల్ నటించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ దాదాపు ఇలాంటి కాన్సెప్ట్ తోనే తెరకెక్కింది. కానీ ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ గా ఉండే హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకుందాం.
స్టోరీలోకి వెళ్తే…
కథ అకస్మాత్తుగా సంభవించే గ్లోబల్ డిజాస్టర్ తో మొదలవుతుంది. సూర్యుడు విడుదల చేసే కాంతి లేదా రేడియేషన్ మానవులకు ప్రాణాంతకంగా మారుతుంది. సూర్యరశ్మి తాకిన వారు ఆ క్షణమే అక్కడికక్కడే చనిపోతారు. ఈ విపత్తు గురించి తెలిసిన కొద్దిమంది మాత్రమే బతకడానికి ప్రయత్నిస్తారు.
కథ బ్రస్సెల్స్‌లోని ఒక విమానాశ్రయంలో ప్రారంభమవుతుంది. సిల్వీ అనే యువతి రాత్రి విమానంలో మాస్కోకు ప్రయాణించాలని అనుకుంటుంది. అదే సమయంలో టెరెంజియో అనే నాటో సైనిక అధికారి విమానాశ్రయంలోకి హడావిడిగా వచ్చి, సూర్యుడు ప్రమాదకరమైనదని హెచ్చరిస్తాడు. అతను విమానాన్ని హైజాక్ చేసి, సూర్యరశ్మి నుండి తప్పించుకోవడానికి పశ్చిమ దిశగా (రాత్రి సమయంలో) ఫ్లైట్ ను నడపమని ఆదేశిస్తాడు.
విమానంలో వివిధ దేశాల నుండి వచ్చిన ప్రయాణికులు ఉంటారు. వారిలో విభిన్న నేపథ్యాలు, భాషలు, వ్యక్తిత్వాలు ఉన్న వారంతా ఉంటారు. సూర్యరశ్మి నుండి తప్పించుకోవడానికి విమానాన్ని రాత్రి సమయంలోనే ఆకాశంలో తిప్పుతూ ఉంటారు. ఈ ప్రయాణంలో ఇంధన సమస్యలు, సాంకేతిక లోపాలు, ప్రయాణికుల మధ్య విభేదాలు వంటి సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ సిరీస్ లో రెండు సీజన్లు ఉన్నాయి. మొదటి సీజన్లో సూర్యుడు ఇలా మారడానికి గల సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. రెండవ సీజన్ లో ఆర్మీ బంకర్ లో దాక్కుంటారు. కానీ అక్కడ మరిన్ని సమస్యలను ఫేస్ చేస్తారు. సేఫ్ గా ఉండాల్సిన ఆర్మీ బంకర్ లో వీళ్ళకు ఎలాంటి సమస్య ఎదురైంది? చివరకు ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టారా లేదా? అనేది ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాలి.
Read also : ఇదేం చిత్రం మావా !? ఈ ఊళ్ళో చనిపోయిన వాళ్ళంతా తిరిగొస్తారు… వర్త్ వాచింగ్ సర్వైవల్ థ్రిల్లర్
ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ?
మానవులు ఇలాంటి డిజాస్టర్ సమయంలో ఎలా స్పందిస్తారు? సహకారం – స్వార్థం మధ్య సంఘర్షణ, భిన్న సంస్కృతులు, భాషల మధ్య సమన్వయం, పర్యావరణ సమస్యలు, టెక్నాలజీ పేరుతో జరిగే వినాశనం వంటి అంశాలు ఈ సిరీస్ లో చూడవచ్చు. ఈ సిరీస్ పేరు “Into the Night”. ఇదొక బెల్జియన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టీవీ సిరీస్, 2020లో విడుదలైంది. ఇది నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్, కాబట్టి నెట్‌ఫ్లిక్స్‌లోనే అందుబాటులో ఉంది.