HIT 3 Teaser Review :సాధారణంగా నాని (Nani) అంటే హోమ్లీ గా కనిపిస్తూ.. లవర్ బాయ్ గా చాలా క్యూట్ గా ఉంటాడు.అందుకే ఎంతో మంది అమ్మాయిల ఫేవరెట్ హీరో అయిపోయారు. కానీ దసరా సినిమాలో మాస్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసి, అటు అబ్బాయిలకి కూడా నాని నచ్చేసాడు. కానీ ఎవరు ఊహించని రేంజ్ లో ‘హిట్ 3’ లో కనిపించనున్నాడు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హిట్ 3 నుండి టీజర్ విడుదల చేయగా..ఇందులో నాని బీభత్సకరమైన నటనను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా.. “ఇంత వైలెంట్ ఏంటి నాని.. భయంతో ఒక్క క్షణం మా ఊపిరి ఆగిపోయిందిగా..” అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. జనాలు ఇన్ని రోజులు అదే అనుకున్నారు.. ఇకపై అసలు చూస్తారు.. అంటూ చెప్పిన డైలాగ్ , నాని పర్ఫామెన్స్ కి అద్దం పడుతోంది అని అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ టీజర్ ఎలా ఉంది? నాని పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? అనేది ఒకసారి చూద్దాం.
హిట్ 3 టీజర్ రివ్యూ..
ఇదివరకే ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను (Shailesh Kolanu) దర్శకత్వంలో హిట్, హిట్ 2 చిత్రాలు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హిట్ సినిమాలో విశ్వక్ సేన్ (Vishwak Sen), హిట్ 2లో అడివి శేషు(Adivi shesh) తమ నటనతో అబ్బురపరిచారు. హిట్ 3 లో నాని అంతకుమించి నటించబోతున్నారు. ఇక తాజాగా హిట్ 3 మే 1వ తేదీన సమ్మర్ స్పెషల్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుండి.. నాని బర్తడే స్పెషల్ గా టీజర్ ను విడుదల చేసారు. టీజర్ మొదలవగానే యుద్ధాన్ని తలపించే సన్నివేశాలను చూపిస్తూ.. చెట్టుకి తలకిందులుగా వేలాడదీసిన ఒక శవంతో ప్రారంభం అవుతుంది. పోలీస్ టీం ఒక సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. సమస్య లేదంటే ఒక పేరు చెబుతా.. వారే అర్జున్ సర్కార్ అంటూ కాస్త గంభీరమైన వాయిస్ వినిపించగా.. పోలీస్ ఆఫీసర్ పాట్రలో నటిస్తున్న రావు రమేష్ మాట్లాడుతూ..” ఈ కేస్ వాడికి అప్పగించడానికి ప్రాబ్లమ్ ఏం లేదు కానీ.. వీడి లాఠీకి చిక్కినోడి పరిస్థితి ఆలోచిస్తుంటేనే భయం వేస్తోంది ” అంటూ రావు రమేష్ చెబుతారు.
విజృంభించేసిన నాని..
ఇందులో నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఒక రౌడీని మించి రెచ్చిపోయారు. ముఖ్యంగా తన నటనతో ప్రత్యర్థులపై ఇష్టం వచ్చినట్లుగా విరుచుకుపడుతూ చాలా భయంకరంగా నటించేసాడు నాని. ముఖ్యంగా తన లాఠీతో ఎదుటివారిని కొట్టడం చూసి..నానిలో ఇంత క్రూరత్వం ఉందా అనేట్టుగా అనిపిస్తుంది. ఇక ఇందులో శ్రీనిధి శెట్టి (Shrinidhi shetty) ని చూపించకుండా ఆమె వాయిస్ ని మాత్రమే వినిపిస్తూ.” ఫస్ట్ నిన్ను చూసినప్పుడే అనిపించింది.. ఒక పోలీస్ ఆఫీసర్ వేనా నువ్వు అని ప్రశ్నించగా.. ఇక నాని వైట్ కోట్ ధరించి మిస్టర్ లాగా హీరోయిన్ ముందుకు వచ్చి..” ఇదేనమ్మి ఇన్ని రోజులు మోసపోయారు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్c అంటూ నాని చెప్పిన డైలాగు టీజర్ కి హైలెట్గా నిలిచింది. ముఖ్యంగా నాని ఇందులో విజృంభించేశారు. ఇప్పటివరకు నానిని చూడని క్యారెక్టర్ లో సరికొత్తగా చూడబోతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ ఆధారంగా ఈ సినిమా వచ్చినా.. ఈ సినిమా చాలా వైలెంట్ గా ఉందని స్పష్టమవుతుంది. మొత్తానికి అయితే మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నారని చెప్పవచ్చు