BigTV English

USAID Employee Fired : మళ్లీ వేసేశాడు!.. యూఎస్‌ ఎయిడ్‌ 2వేల మంది ఉద్యోగులను తొలగించిన ట్రంప్

USAID Employee Fired : మళ్లీ వేసేశాడు!.. యూఎస్‌ ఎయిడ్‌ 2వేల మంది ఉద్యోగులను తొలగించిన ట్రంప్

Trump Fires USAID Employees | అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలు, మానవతా సహాయం కోసం అమెరికా ఇన్నాళ్లు నడుపుతున్న యూఎస్‌ ఎయిడ్ (USAID)సంస్థను అగ్రరాజ్యం ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్వీర్యం చేశారు. ఈ సంస్థ పలు ద్వారా పేద దేశాలకు అందించబడుతున్న నిధులను ట్రంప్ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ఆపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా 2,000 మంది యూఎస్‌ ఎయిడ్ సంస్థ ఉద్యోగులను తొలగిస్తూ.. ట్రంప్ నోటీసులు జారీ చేశారు. మిగిలిన ఉద్యోగులలో కొంతమందిని మినహాయించి, ఈ సంస్థ కోసం ఇతర దేశాల్లో పనిచేస్తున్న వేలమందికి బలవంతపు సెలవులు ఇవ్వబడ్డాయని యూఎస్‌ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ వెబ్‌సైట్‌లోని నోటీసు ద్వారా తెలుస్తోంది. ఫెడరల్ జడ్జి అనుమతి తర్వాతే ట్రంప్ యంత్రాంగం ఈ చర్యలో ముందుకు సాగింది.


ప్రభుత్వ ప్రణాళికను నిలిపివేయాలని ఉద్యోగులు కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కానీ వారి విజ్ఞప్తిని యూఎస్‌ డిస్ట్రిక్ట్ జడ్జి కార్ల్ నికోలస్ తిరస్కరించారు. ప్రభుత్వం చేసే అనవసర ఖర్చులను తగ్గించడానికి ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజె (DOGE) ఇప్పటికే అనేకమంది యూఎస్‌ ఎయిడ్ ఉద్యోగులపై తొలగింపు చర్యలు తీసుకుంది. ఇటీవల తీసుకున్న ఈ నిర్ణయంతో మిగిలిన ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే.. యూఎస్‌ ఎయిడ్ ద్వారా వృథా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని.. అది ఒక నేరగాళ్ల సంస్థ అని ఎలాన్ మస్క్ ఇప్పటికే ఆరోపించారు. ఈ కారణాలతోనే ట్రంప్ ప్రభుత్వం నిధులను ఆపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్యలో భాగంగా.. దాదాపు 600 మంది ఉద్యోగులను కార్యాలయ భవనంలోకి ప్రవేశించనివ్వకుండా నిరోధించారు.

యూఎస్ ఎయిడ్ ఉద్యోగుల తొలగింపు ఆదేశాలపై ఫెడరల్ జడ్జి అమీర్ అలీ గత వారం తాత్కాలికంగా స్టే ఇచ్చారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులు యూఎస్‌ ఎయిడ్ ద్వారా సహాయం అందించడానికి ఆమోదం తెలిపినప్పుడు, ప్రభుత్వం దాన్ని ఎలా నిలిపేయగలదని జడ్జి ప్రశ్నించారు.


Also Read: జర్మనీ చాన్స్‌లర్‌ ఎన్నికల్లో మెర్జ్‌ గెలుపు.. మూడో స్థానానికి పడిపోయిన అధికార పార్టీ

అయినప్పటికీ ట్రంప్ తన చర్యలను సమర్థించుకున్నారు. యూఎస్‌ ఎయిడ్ ద్వారా భారతదేశంలో జరిగిన ఎన్నికలలో పోలింగ్ శాతం పెంచడానికి అమెరికా ప్రభుత్వం రూ. 182 కోట్లు ఇచ్చిందని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. ఇకపై అటువంటి నిధులను రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో అధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారతదేశం వద్ద చాలా డబ్బు ఉందని, ఆ దేశానికి తామెందుకు నిధులు ఇవ్వాలని ప్రశ్నించారు. దీంతో ఈ విషయంపై ఇరుదేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చరిత్రలో ఎన్నడూ లేనిది చేస్తున్నా… తనను తాను పొగుడుకున్న ట్రంప్
ఫెడరల్ ప్రభుత్వంలోని వేల మంది ఉద్యోగులను తొలగించడం ద్వారా ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించడమనేది చరిత్రలో ఎవరూ చూడనిదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తన ప్రభుత్వం ఈ చర్య ద్వారా బ్యూరోక్రాట్లను తొలగించి.. వారిని బయటకు పంపుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఆయన తనను తాను అభినందించుకున్నారు. రాజధాని వాషింగ్టన్ శివార్లలో శనివారం జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని శుభ్రపరచాలని, అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసదారులను అరికట్టాలని, పన్నులను తగ్గించాలని ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించారని ఆయన తెలిపారు. అలాగే ఉక్రెయిన్ యుద్ధం ఆపేందకు చర్చలు తుది దశలో ఉన్నట్లు ఆయన తెలిపారు. “నేను ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో మాట్లాడుతున్నా. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ఐరోపా దేశాలకే ఇబ్బందులు. అమెరికాకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. అయితే ఈ యుద్ధంపై ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం. త్వరలో యుద్ధం ముగుస్తుంది” అని ట్రంప్ పేర్కొన్నారు.

అక్రమవలసదారులు బురద
అక్రమ వలసదారులను వెనక్కి పంపడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు. సరైన పత్రాలు లేని దొంగలను, మోసగాళ్లను, విదేశీయులను తిరిగి పంపించడం ద్వారా బురదను వదిలించుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన నేరగాళ్లను వారి స్వదేశాలకు పంపుతున్నామని, బురదను వదిలించుకుని ప్రజలతో ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తున్నామని ఆయన వివరించారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×