Nani : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో, నాచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. గతేడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఆ రెండు భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరస సినిమాలు క్యూ కట్టాయి. ఈ ఏడాది ప్రముఖ మాస్టర్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. మేడే సందర్భంగా మే 1న థియేటర్లలోకి వచ్చేసిన ఈ సినిమా రెండు వారాలు అవుతున్న కూడా అదే జోరులో కలెక్షన్స్ ని వసూలు చేస్తుంది. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 58 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 111 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
మొదటి వారందుమ్ము దులిపేసింది. అదే రేంజ్ లో సెకండ్ వీకెండ్ భారీ గా కలిసొస్తుందని అందరూ ఆశించారు.. అయితే ఈ సినిమా విజయాన్ని అందుకున్న నేపథ్యంలో నానికి మార్కెట్ లో డిమాండ్ కూడా పెరిగింది.. దాంతో భారీగా రెమ్యూనరేషన్ ను పెంచేసినట్లు ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. అయితే ప్రస్తుతం నానికి ఒక్క సినిమాకు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నాడో ఒకసారి తెలుసుకుందాం..
రెమ్యూనరేషన్ ను పెంచేసిన నాని..?
ఈమధ్య ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే ఆ తర్వాత సినిమాకు రెమ్యూనరేషన్ కూడా భారీగా పనిచేస్తున్నారు స్టార్ హీరోలు. అదేవిధంగా హీరో నాని కూడా ఒక్కో సినిమా హిట్ అవుతుంటే రెమ్యూనరేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నాడు. రీసెంట్ గా వచ్చిన చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు నాని మరోసారి తన రెమ్యూనిరేషన్ ని పెంచినట్లు తెలుస్తుంది. హిట్ 3 సినిమా కోసం 20 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకున్న ఆయన తర్వాత సినిమా కోసం 40 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది..
Also Read :నక్కతోక తొక్కిన శ్రీలీల.. మరో బంఫర్ ఆఫర్..?
ఇప్పటికే నాని ఖాతాలో ఎన్నో హిట్స్ సినిమాలు పడ్డాయి. దాంతో పారితోషికాన్ని పెంచేశాడు. ఇలాగే మరో హిట్ సినిమా కనక ఆయన ఖాతాలో పడితే టైర్ వన్ హీరో అయిపోయినట్లే.. ప్రస్తుతం అంత డిమాండ్ చేస్తున్న సరే నానితో సినిమాలు చేసి ఎలాగైనా హిట్ కొట్టాలని కొందరు దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ప్యారడైజ్ సినిమా షూటింగ్లో తను పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా మీదనే ఆయన పూర్తి ఫోకస్ పెట్టారట. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ వరుసగా సినిమాలు చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు ఇలా కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. ఇలా ఎంట్రీ ఇచ్చిన హీరోలు చాలామంది ఇప్పటికీ సక్సెస్ సినిమా లేక సతమతమవుతున్నారు. నానికి అదృష్టం కూడా ఎక్కువగానే ఉందని చెప్పాలి.