BigTV English

Indo-Pak Tensions: మారని పాక్ వైఖరి.. ప్రధాని ప్రసంగం తర్వాత, సాంబా సెక్టార్‌లో అలజడి

Indo-Pak Tensions: మారని పాక్ వైఖరి.. ప్రధాని ప్రసంగం తర్వాత, సాంబా సెక్టార్‌లో అలజడి

Indo-Pak Tensions: భారత్ విషయంలో పాకిస్థాన్ వైఖరి మారలేదా? యుద్ధానికి రెడీ అవుతోందా? అమెరికా ఒత్తిడి వల్లే అంగీకరించిందా? ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కాసేపటికి జమ్మూకాశ్మీర్‌లో పాక్ డ్రోన్లు ఎంటరయ్యాయి. భారత్ సైన్యం అలర్ట్‌గా ఉండడంతో వాటిని కూల్చివేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? ఇదే చర్చ జోరుగా సాగుతోంది.


భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం రాత్రి సైలెంట్‌గా ఉన్న పాకిస్తాన్ బలగాలు, సోమవారం రాత్రి మాత్రం తన కుటిల బుద్ది బయట పెట్టుకుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో పాకిస్తాన్ డ్రోన్లు హంగామా చేశాయి. పరిస్థితి గమనించిన భారత ఆర్మీ వాటిని కూల్చివేసింది.

ఆకాశంలో రాత్రి 9 గంటల సమయంలో ఎర్రటి చారలు కనిపించాయి.  వీటిని పసిగట్టిన సైన్యం వాటిని పేల్చివేసింది. ఆ ప్రాంతంలో పేలుడు శబ్దం వినబడిందని స్థానికులు చెబుతున్నారు. పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీని తర్వాత సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు.


దాయాది దేశంతో చర్చలు గనుక జరిగితే ఉగ్రవాదం నిర్మూలన, పాకస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంశాలపై మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ప్రధాని ప్రసంగం తర్వాత దాయాది దేశం కవ్వింపు చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. అయినా సోమవారం సాయంత్రం ఇరుదేశాల డీజీఎంవోల మధ్య చర్చలు హాట్‌లైన్ ద్వారా దాదాపు అరగంటపాటు జరిగాయి.

ALSO READ: బెదిరింపులకు భయపడేది లేదు, ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, ఆపరేషన్ సిందూర్..

ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్పులకు చోటు ఇవ్వరాదని, బలగాలను తక్షణ కుదించుకోవాలని నిర్ణయించారు. ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగరాదని డిసైడ్ అయ్యారు. అంతలో పాకిస్తాన్ డ్రోన్లు కాశ్మీర్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. భారత సైన్యం అలర్ట్‌గా లేకుంటే నష్టం జరిగేదని అంటున్నారు.

జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సమీపంలో తక్కువ సంఖ్యలో డ్రోన్లు గుర్తించింది సైన్యం. తాజా పరిస్థితి నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో సాంబా, కథువా, రాజౌరి, జమ్మూలోని అనేక ప్రాంతాలలో విద్యుత్తు నిలిపివేసినట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా మాతా వైష్ణోదేవి దేవాలయం వద్ద లైట్లు ఆపి వేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

పాకిస్తాన్ 740 కిలోమీటర్లు పొడవైన నియంత్రణ రేఖ వెంబడి తరచుగా ఉల్లంఘనలకు పాల్పడుతోంది దాయాది దేశం. జమ్మూ జిల్లాలో సరిహద్దు వెంబడి రాజౌరి, పూంచ్, అఖ్నూర్, పర్గ్వాల్ సెక్టార్‌కు దక్షిణం వైపుకు వ్యాపించింది.  జలంధర్ డిప్యూటీ కమిషనర్ హిమాన్షు మాట్లాడుతూ  రాత్రి 9.20 గంటల ప్రాంతంలో మాండ్ గ్రామం సమీపంలో నిఘా డ్రోన్‌ను కూల్చివేసినట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు.

 

 

Related News

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Indian Army Upgrades: పాక్‌కు ముచ్చెమటలు పట్టించే నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఏకంగా రూ.67 వేల కోట్లతో…

Uttarkashi Cloudburst: ఉత్తరకాశీ విషాదం.. 28 మంది కేరళా టూరిస్టులు గల్లంతు.. పెరుగుతోన్న మరణాల సంఖ్య

MLAs Free iPhones: ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐఫోన్లు.. రాజకీయ రచ్చ, ఎక్కడంటే

Poonch sector firing: కాల్పులకు తెగబడ్డ పాక్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సైన్యం!

Dharali floods: 11 మంది జవాన్లు గల్లంతు.. మరో నలుగురు మృతి.. అక్కడ ఊరుఊరంతా..?

Big Stories

×