BigTV English

Sreeleela : నక్కతోక తొక్కిన శ్రీలీల.. మరో బంఫర్ ఆఫర్..?

Sreeleela : నక్కతోక తొక్కిన శ్రీలీల.. మరో బంఫర్ ఆఫర్..?

Sreeleela : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. మొదటి సినిమాతోనే క్రేజీ హీరోయిన్గా మారిపోవడంతో పాటు యూత్ క్రష్ అయింది. తన అందం అభినయంతో తెలుగు అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. అలా ఒక్క సినిమాతో తన క్రేజీని పెంచుకుంటూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వరుస సినిమాలతో తీసుకుపోతుంది. రవితేజ ‘ధమాకా’ హిట్ కావడంతో ఆమెకు తిరుగులేకపోయింది. కొన్నేళ్ల వ్యవధిలోనే ఆమె సినిమాల సంఖ్య డబుల్ డిజిట్‌కు చేరిపోయింది. తెలుగుకే పరమితం కాకుండా బహుభాషలకు ఆమె ప్రభ విస్తరిస్తోంది.. ప్రస్తుతం ఈమె తెలుగుతోపాటు తమిళ్ అటు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది… తాజాగా బాలీవుడ్లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది ఏ సినిమాలో శ్రీలీల నటించబోతుందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


బాలీవుడ్ లో బంఫర్ ఆఫర్.. 

శ్రీలీల ఇండస్ట్రీకి అడుగు పెట్టినప్పటి నుంచి హిట్ సినిమాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ పోతుంది.. దాంతో సినిమాలు హిట్ అవ్వకపోవడంతో కాస్త రియలైజ్ అయ్యింది. ప్రస్తుతం వెయిట్ ఉన్న పాత్రల్లో నటిస్తుంది. తెలుగులో చివరగా రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బాలీవుడ్ లోనే వరుసగా సినిమా అవకాశాలు తెలుస్తుంది. తాజాగా మరో ఆఫర్ శ్రీ లీలా తలుపు తట్టింది. బాలీవుడ్లో శ్రీలీల నటించబోయే రెండో చిత్రం కూడా సీక్వెలే కావడం విశేషం. కరణ్ జోహార్ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’ నిర్మించబోయే ఆ చిత్రమే.. దోస్తానా-2. జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్ నటించిన ‘దోస్తానా’ పెద్ద హిట్టే అయింది..


హీరో ఎవరంటే..? 

గతంలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కార్తీక్ ఆర్యన్, ‘కిల్’ ఫేమ్ లక్ష్య, జాన్వి కపూర్‌లతో ‘దోస్తానా-2’ చేయాలనుకున్నారు.. కానీ అది ముందుకు సాగలేదు. దాంతో మేకర్స్ రూటు మార్చేశారు. ఇప్పుడు కార్తీక్ స్థానంలో విక్రాంత్ మాసే, జాన్వి స్థానంలో శ్రీలీలను ఎంపిక చేసి సినిమాను పట్టాలెక్కిస్తున్నారని సమాచారం. ఆమిర్ ఖాన్‌తో ‘లాల్ సింగ్ చడ్డా’ లాంటి డిజాస్టర్ తీసిన అద్వైత్ చౌహాన్ ‘దోస్తానా-2’ను డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకపోవచ్చని.. ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురావాలని కరణ్ జోహార్ భావిస్తున్నారు. అలాగే సినిమాను కూడా తెరకేకిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక తెలుగులో సినిమాలు వస్తే శ్రీలీల రవితేజతో సినిమా చేస్తుంది.. అలాగే మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది.. అటు తమిళ్ లో కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. ఇది నా ఈ ఏడాది పెద్దగా సినిమాలతో థియేటర్లలోకి రాకపోయినా సరే వచ్చే ఏడాది మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను పలకరిస్తుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×