Samuel French: సినీ ఇండస్ట్రీలో చాలా మంది క్యాన్సర్ బారినపడుతున్నారు.. కానీ, చాలా మంది క్యాన్సర్ ను జయించి తిరిగి సినిమాలలో నటించడం మనం చూస్తూనే ఉన్నాం.. క్యాన్సర్ ని జయించడం అంత సులువు కాదని ఎంతో మంది వారి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు షూట్ చేసిన వీడియోలు మనం అడపా దడపా చూస్తూనే ఉన్నాం. కానీ క్యాన్సర్ ని జయించలేక చికిత్స పొందుతూ సెలబ్రిటీస్ చాలా మంది ప్రాణాలు విడిచినవారున్నారు.. తాజాగా క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ ప్రముఖ హాలివుడ్ నటుడు శ్యాముల్ ఫ్రెంచ్ కన్నుమూశారు..
క్యాన్సర్ తో స్టార్ యాక్టర్ మృతి..
హాలీవుడ్ నటుడు శ్యాముల్ ఫ్రెంచ్ కు (45) సంవత్సరాలు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూ హాస్పిటల్ లో ఈరోజు కన్నుమూశారు. పరిస్థితి విషమించడంతో తుదిత్వాస విడిచినట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. గత కొంతకాలంగా శ్యాముల్ క్యాన్సర్ తో బాధపడుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. ఈయన మృతి పట్ల హాలీవుడ్ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. ఆయన మృతి పట్ల ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
గుర్తింపు తెచ్చిన మూవీస్ ..
కాగా శ్యాముల్ నటించిన సినిమాలలో కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, ఫియర్ ది వాకింగ్ డెడ్, టెక్సాస్ రైజింగ్, వంటివి పాపులారిటీ సాధించాయి. ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. ఆయన జనవరి 26 1980లో టెక్సాస్ లో జన్మించారు గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన చివరి రోజుల్లో డిహైడ్ హైడ్రేషన్ కోసం ఐవీ చికిత్స తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయనకు ఓ కుమార్తె కలదు మాడిసన్ రూబీ ఫ్రెంచ్ ఆమెకు 12 సంవత్సరాలు.ఆయన క్లిస్టర్ హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం టెక్సాస్ లో నివసిస్తున్నారు.
శ్యాముల్ పొందిన అవాడ్స్ …
శ్యాముల్ ఫ్రెంచ్ 2017 లో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు .మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వంలో వచ్చిన కిల్లర్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ సినిమాలో అండర్ కవర్ ఏజెంట్ గా నటించారు. ఈ చిత్రంతో ఆయనకు మంచి ప్రశంసలు అందుకున్నారు. 2020లో వచ్చిన ఫియర్ ది వాకింగ్ డెడ్ ఈ మూవీలో ఆయన అతిధి పాత్రలో కనిపించిన మెప్పించారు. 2017 లో వచ్చిన టెక్సాస్ రైసింగ్ వెబ్ సిరీస్ లో ఆయన చిన్న పాత్రలో కనిపించాడు. గత సంవత్సరం,ఫియర్ ది వాకింగ్ డెడ్ మూవీలో నటించారు.ఈ మూవీ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఈ మూవీకి గాను అతను ఉత్తమ నటుడిగా అవార్డును గెలుపొందారు. ఆయన 2025లో మోస్ట్రస్ వితిన్ అనే మూవీలో ఉత్తమ సహాయనుడిగా అవార్డు గెలుపొందారు. ఇక ఆయన రాబోయే చిత్రాలు 2025లో తౌపాత్(Towpath) చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు. అతని చివరి ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఏప్రిల్ 23,2025లో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు ఫోటోలు షేర్ చేసారు.ఈరోజు ఆయన లేరు అని తెలుసుకున్న,హాలీవుడ్ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది.