Nagarjuna: టాలీవుడ్ లో బడా హీరోలు అంటే నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి.. అత్యధిక సినిమాలలో హీరోలుగా నటించింది కూడా ఈ నలుగురే.. బాలకృష్ణ వంద సినిమాలు పూర్తి చేశాడు. చిరంజీవి ఇప్పటికే 150 సినిమాలకు పైగా నటించారు. ఇక నాగార్జున సెంచరీకి చేరువలో ఉన్నారు.. నాగార్జున ఇప్పటికి 99 సినిమాలు పూర్తి చేశారు. వందో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు సమాచారం.. నాగార్జున తన 100 వ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ తో చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎవరో చూద్దాం..
రూటు మార్చిన నాగర్జున..
నాగార్జున తన మొదటి సినిమా విక్రమ్ మంచి సక్సెస్ ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన మజ్ను మూవీలో నటించి మెప్పించారు. శ్రీదేవితో వచ్చిన ఆఖరి పోరాటం, ఆయనకు మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన మెప్పించారు. ఇప్పుడు తాజాగా ఆయన కూలీ, కుబేర మూవీలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాగార్జున గత ఏడాది నాసామిరంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ఇప్పుడు ఆయన తన 100 వ సినిమాపై ఫోకస్ పెట్టారు. తన బెంచ్ మార్క్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. నాగార్జున తన వందవ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ ఓ స్టోరీలైన్ వినిపించినట్లు, నాగ్ ఓకే చెప్పినట్లు సమాచారం. కార్తీక్ గతంలో తమిళంలో నీతం ఓరువానం, చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా తెలుగులో డబ్ చేసి ఆకాశం పేరుతో రిలీజ్ చేశారు. ఆ మూవీ హిట్ అవ్వలేదు. కానీ దర్శకుడిగా కార్తీక్ మంచి పేరు వచ్చింది. ఈ మూవీ తర్వాత కార్తీక్ కి నాగార్జున తన 100వ సినిమా ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన తన వందో చిత్రం కోసం ప్రసన్నకుమార్, తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు గట్టిగా వినిపించాయి.. అయితే వారు ఎవరిని కాదని కార్తీక్ కి ఈ ప్రాజెక్టు ఖరారు అయినట్లు కనిపిస్తోంది.
100వ సినిమా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో..
నాగార్జున ఇప్పటికే ధనుష్ మూవీ కుబేర,రజనీ కాంత్ మూవీ కూలి షూటింగ్ లో వున్నరు.ఈ చిత్రాలు పూర్తయిన తర్వాత నాగ్ 100 వ చిత్రాన్ని పట్టాలు ఎక్కించనున్నట్లు సమాచారం. అక్కినేని అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ మూవీ రూపొందిచనున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ స్టోరీ చెప్పేశారుట. సెకండ్ హాఫ్ ఇంకొంచెం మెరుగ్గా స్క్రిప్ట్ రాసుకొని నాగార్జున కి మరోసారి చెప్పనున్నట్లు సమాచారం. ఈ స్టోరీ మాఫియా బ్యాగ్రౌండ్ కాన్సెప్ట్ తో రానున్నట్లు టాక్. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ చిత్రం 2026లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగ్ సెంచరీ మూవీ కోసం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.