BigTV English
Advertisement

US Election 2024 : అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. మద్దతు తెలిపిన హాలీవుడ్ ప్రముఖులు ఎవరంటే?

US Election 2024 : అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. మద్దతు తెలిపిన హాలీవుడ్ ప్రముఖులు ఎవరంటే?

Hollywood celebrities support Donald TrumpUS Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ), డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ( Kamala Harris ) ల మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే.. గతంలో ట్రంప్ పాలన బాగుందని ఎక్కువ మంది ట్రంప్ నే కావాలని కోరుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఆధిక్యం కనబరుస్తున్నారు. విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. ట్రంప్ ఇప్పటికే 239 ఎలక్టోరల్ ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ట్రంప్ కు పోటీగా కమలా హారిస్ నిలబడ్డారు. కానీ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగగా, ఆమె వెనకంజ వేశారు.. ట్రంప్ అధ్యక్షుడుగా నిలవాలని అమెరికా ప్రజల తో పాటుగా హాలివుడ్ సెలెబ్రేటీలు కూడా కోరుకున్నారు.. ఆయనకు మద్దతుగా నిలిచిన ప్రముఖులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


ఉదయం నుంచి జోరుగా మొదలైన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(US Presidential election 2024) రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (donald trump) ఘన విజయం సాధించారు.. ఈయన అమెరికాకు చేసిన సేవలే ఆయనకు మళ్లీ ఆయన పాలనను కావాలని కోరుకున్నారు. వారు గట్టిగా అనుకోవడం వల్లే ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించారని ప్రముఖ మీడియా ఛానెల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన అధ్యక్షులుగా రావాలని, చాలా మంది కోరుకున్నారు. హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ట్రంప్ కు మద్దతుగా నిలిచారు. ట్రంప్ పాలన తమకు బాగుందని సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు..

ట్రంప్ గెలవాలని హాలీవుడ్ యాక్టర్స్.. జాన్ వోట్, డేన్నిస్ క్వాడ్, మెల్ గిబ్సన్, రోశన్నే బర్రె తో పాటుగా మరికొంత మంది ప్రముఖులు ఉన్నారు. అలాగే మ్యూజిషియన్స్ కిడ్ రాక్, జాసన్ అల్డెన్, అంబర్ రోజ్, అజ్లియా బ్యాంక్స్, లిల్ పంప్ తదితరులు ట్రంప్ గెలవాలని మద్దతుగా నిలిచారు.. వీరితో పాటుగా సామాన్యులు కూడా ట్రంప్ పాలన మళ్లీ కావాలని కోరుకున్నారు. అమెరికా 47 వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకొనున్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు కావడం ఇది రెండోసారి. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఇప్పటికే 277 సీట్లలో విజయం సాధించారు. అధ్యక్షుడు కావడానికి మ్యాజిక్ ఫిగర్ 270 కాగా ఆయన 7 స్థానాల ఎక్కువగానే గెలుచుకున్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 266 సీట్ల తో సరిపెట్టుకున్నారు.. ఇక ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికలలో 538 ఎలక్టోరల్ ఓట్లలో 304 గెలుచుకున్నప్పటికీ ప్రజాదరణ పొందిన ఓట్లను గెలుచుకోవడం లో విఫలమయ్యారు.. ఇక ట్రంప్ పై గతంలో ఎన్నో విమర్శలు కూడా ఎదురయ్యాయి. అయిన ఇప్పుడు భారీ విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదు.. మరి ఈ సారి ఆయన కర్తవ్యాన్ని సరిగ్గా నెరవేరుస్తారేమో చూడాలి.. ఇక ట్రంప్ విజయం పై టాలీవుడ్ లోని ప్రముఖులు కూడా ఆయనకు సోషల్ మీడియాలో ద్వారా అభినందనలు తెలుపుతున్నారు..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×