BigTV English

 US Election 2024 : కమల హ్యారిస్ ఓటమితో.. తమిళనాడులోని ఈ గ్రామంలో నిరాశ.. ఎందుకంటే.?

 US Election 2024 : కమల హ్యారిస్ ఓటమితో.. తమిళనాడులోని ఈ గ్రామంలో నిరాశ.. ఎందుకంటే.?

 US Election 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్లు విజయం సాధించడంతో.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దాంతో.. రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో నిలిచిన కమలా హ్యారిస్ ఓటమి పాలయ్యారు. దీంతో.. అమెరికాలోని రిపబ్లికన్లల్లో నిరాశ ఉండడం సహజం. కానీ.. మన దేశంలోని తమిళనాడులోని ఓ గ్రామం సైతం తీవ్ర నిరాశ నెలకొంది. కమలా హ్యారిస్ గెలిస్తే.. తాము ఎంతో సంతోషించే వాళ్లమంటున్న ఆ గ్రామస్తులు, ఇప్పుడు బాధలో ఉన్నామంటున్నారు. ఎందుకో తెలుసా..?


కమలా హ్యారిస్ పూర్వికులు తమళనాడుకు చెందిన తులసేంద్రపురం అనే గ్రామానికి చెందిన వారని చెబుతుంటారు. ఈ కారణంగానే.. వారు తన వారసురాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షురాలిగా ఎన్నికైతే తమకు గర్వకారణం అంటున్నారు. హ్యారిస్ గెలుస్తుందనే ఉద్దేశ్యంతో.. ఇప్పటికే గ్రామంలో వేడుకలకు సిద్ధం చేసిన గ్రామస్తులు.. కమల హ్యారిస్ గెలిస్తే పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అలాగే.. స్థానికంగా ఉన్న గుడిలో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. కానీ.. వాళ్ల ఆశలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ట్రంప్ గెలుపునతో.. తమ వారసురాలు ఓటిపోయిందంటూ నిరాశలో కూరుకుపోయారు.

కమలా హ్యారిస్ తాత పీవీ గోపాలన్ 100 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఉండే వారు. ఆయన కూతురు, హ్యారిస్ తల్లి.. శ్యామలా గోపాలన్ ఈ గ్రామంలోనే పుట్టి పెరిగారు. తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన శ్యామల అక్కడే.. డోనాల్డ్ హ్యారిస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కమల హ్యారిస్ తండ్రి.. డోనాల్డ్ హ్యారిస్ జమైకా నుంచి ఉన్నత చదువులు కోసం యూఎస్ వచ్చాడు. కమల పుట్టిన తర్వాత.. శ్యామల, డోనాల్డ్ విడిపోయారు. తన చిన్నప్పటి నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాలోనే పెరిగిన కమల.. చాలా చిన్న వయసులో తమ తాతగారి ఉరైన తులసేంద్రపురం వచ్చారు. మళ్లీ .. ఇప్పటి వరకు ఆమె ఈ గ్రామానికి వచ్చినట్లు చెబుతారు. కానీ.. ఇప్పటి వరకు తన బాల్యంలో అక్కడి వచ్చినట్లు గుర్తు లేదని కమలా హ్యారిస్ చెబుతుంటారు.


వాస్తవానికి కమల హ్యారిస్ కు ఇండియాతో కంటే జమైకా తోనే ఎక్కువగా అనుబంధమని చెబుతుంటారు. తన తండ్రి స్వదేశం అయిన జమైనా గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. అయితే.. తల్లి ద్వారా భారతీయ వంటకాలు, ఇక్కడి సంప్రదాయాలపై కొంత అవగాహన ఉందని.. కొన్ని ఇంటర్వ్యూల్లో కమలా చెప్పారు.

ప్రస్తుత గెలుపుతో ట్రంప్ 47వ అధ్యక్షుడు కానున్నారు. కాగా.. గతంలో చికాగో నుంచి తులసేంద్రపురం వచ్చి స్థిరపడిన కొందరు సైతం.. ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్ విజయావకాశాలే ఎక్కువగా ఉన్నాయని, కానీ.. తాము హ్యారిస్ కు మద్ధతిస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. అందరూ కలిసికట్టుగా, ఐక్యంగా నడిచేలా స్వేచ్ఛ ఇచ్చేందుకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రజల్ని అనేక రకాలుగా విభజిస్తున్న ట్రంప్.. తన పంథా ఇప్పటికైనా మార్చుకుని, ప్రజలను ఏకంగా చేసేవాడిగా మారతాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ నాలుగేళ్లు అమెరికాలో గందరగోళ పరిస్థితులే ఉండనున్నాయి అంటూ వ్యాఖ్యనించారు.

Also Read : మస్క్ మామే లేకుంటే.. ట్రంప్ భావోద్వేగం, తన విజయానికి ఆయనే కారణమంటూ..

అమెరికా ఎన్నికల ఫలితాలు కొంత నిరాశ కలిగించాయన్న గ్రామస్థులు.. డొనాల్డ్ ట్రంప్ గతంలోలా కాకుండా, ఈసారి మరింత మెరుగ్గా పరిపాలిస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
గత ఎన్నికల్లో కమల హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ గా గెలుపొందినప్పుడు.. గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నామని గుర్తుచేసుకున్న ప్రజలు, ఈ సారి ఏకంగా అధ్యక్ష బరిలో నిలవడంతో మరింత ఎక్కువగా సంబరాలు చేసుకోవాలనుకున్నట్లు తెలుపుతున్నారు. కానీ.. అమెరికా ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని ప్రకటించారు

దేశంలోని మెజార్టీ ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లను గెలుపొందడంతో ట్రంప్ మరోసారి శ్వేత సౌధంలోకి వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది. కాగా.. ఇప్పటికే. మెజార్టీ స్థానాలు ట్రంప్ పక్షం చేరడంతో.. ట్రంప్ వర్గం ముందస్తు విజయోత్సవాలను జరుపుకుంటోంది.

Related News

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

Big Stories

×