Lubber Pandhu Review : తమిళ సినిమా ‘లబ్బర్ పందు’ (Lubber Pandhu) మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney + Hotstar) లో స్ట్రిమింగ్ అవుతోంది. తమిళరాసన్ పచ్చ ముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అట్ట కత్తి దినేష్, సంజనా కృష్ణమూర్తి, హరీష్ కళ్యాణ్ లీడ్ రోల్స్ పోషించారు. సెప్టెంబర్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు హాట్ స్టార్ లో తమిళ, తెలుగు భాషలతో పాటు మరో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి కొత్త డైరెక్టర్ రూపొందించిన ఈ స్పోర్ట్స్ డ్రామా తెలుగు ఓటిటి మూవీ లవర్స్ ని ఆకట్టుకుందా? అనే విషయాన్ని చూద్దాం పదండి.
కథ
అభికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. జాలి టీమ్స్ ఆడే ఆటను చూస్తూ ఎప్పటికైనా అందులో భాగం కావాలని వాళ్ళ తరఫున ఆడాలని కోరుకుంటాడు. కానీ అతను ఎంత ప్రయత్నించినా విఫల ప్రయత్నమే అవుతుంది. దీంతో చేసేదిలేక ఏ టింకు ఎప్పుడు ఎక్స్ట్రా ప్లేయర్ అవసరం ఉన్నా సరే వెళ్లి ఆడతాడు. మరో మరోవైపు పక్క ఊర్లో ఉన్న శేషుకి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ చుట్టుపక్కల ఊర్లలో అతనిలా ఆడేవారే లేరు అన్నట్టుగా ఆడతాడు. కుటుంబ బాధ్యతలు ఏవి పట్టించుకోకుండా క్రికెట్ అంటే ప్రాణం పెట్టి ఆడడం అతని భార్య యశోదకి నచ్చదు. ఇక ఈ నేపథ్యంలోనే శేషు, అభి మధ్య గేమ్ గురించి ఈగో క్లాషెస్ వస్తాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే శేషు కూతురరు దుర్గని అభి ప్రేమిస్తాడు. కానీ శేషు కూతురే దుర్గా అనే విషయం అభికి అసలు తెలియదు. అలాగే శేషుకి కూడా తన కూతురు ప్రేమికుడు అభి అని తెలీదు. ఇలా ఇద్దరు తరచుగా గొడవ పడుతూ ఉన్న టైంలోనే దుర్గ ఇంట్లో తన ప్రేమ విషయాన్ని చెప్పి అతన్ని పెళ్లి చేసుకుంటానని తేల్చేస్తుంది. కానీ ఒకానొక సందర్భంలో అసలు విషయం తెలియడంతో శేషు కోపంతో రగిలిపోతాడు. ఇలాంటి టైంలో శేషు, అభి కలిసి ఒకే టీంకు ఆడాల్సి వస్తే పరిస్థితి ఏంటి? ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? అభి శేషు పెళ్లి జరిగిందా లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమాను తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
‘లబ్బర్ పందు’ (Lubber Pandhu) అంటే ‘లబ్బర్ బంతి’ అనే అర్థం వస్తుంది. ఊర్లలో లబ్బర్ బంతితో క్రికెట్ ఆడతారు కాబట్టి ఈ సినిమాకు యాప్ట్ అయ్యే విధంగా టైటిల్ ను పెట్టారు మేకర్స్. సినిమా మొత్తం క్రికెట్ చుట్టూనే నడుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే గేమ్స్, మైదానంలో జరిగే గొడవలు రాజకీయాలు వంటి విషయాల చుట్టూ డైరెక్టర్ ఈ కథను అల్లుకున్నారు. అయితే సినిమా మొత్తం సహజత్వానికి దగ్గరగా ఉండడం అనేది బాగా ఆకట్టుకుంటుంది. సాధారణంగా ఒక గేమ్లో గెలుపు ఓటమి అనేది రెండు టీం లపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఎఫెక్ట్ కూడా వాళ్లపైనే పడుతుంది. కానీ ఈ సినిమాలో కొత్తగా ఆ ఎఫెక్ట్ ప్రేమ జంటపై పడడాన్ని చూపించాడు డైరెక్టర్.
లవ్, ఎమోషన్స్, ఒక గేమ్ పై ఉండే ప్యాషన్, కుటుంబ సమస్యలు వంటి సన్నివేశాలు, లీడ్ రోల్స్ చేసిన నటీనటులు సినిమాలో మెయిన్ హైలెట్ అని చెప్పొచ్చు. కొడితే ఆరడుగుల దూరం పడేటంత ఫైట్స్, రొమాన్స్, సాంగ్స్ లేకపోయినా అలాంటి లోటు లేకుండా తెరకెక్కించారు డైరెక్టర్. ఇక సినిమాలో దినేష్ పురుషోత్తమ ఫోటోగ్రఫీ, సీన్ రోల్డెన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. అనవసరమైన ఈగోలను పక్కన పెట్టాలని, విజయానికి కావాల్సింది సామర్థ్యం మాత్రమేనని ఈ కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అది ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో చిన్న సినిమానే అయినా పెద్ద హిట్ అయింది. అయితే అక్కడక్కడ కొన్ని సాగదీత సన్నివేశాలు, పాటలు తెలుగు ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి.
ప్లస్ పాయింట్స్ :
ఎమోషనల్ సీన్స్
ఫస్టాఫ్
ఇంటర్వెల్
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్‌లో కొంత ల్యాగ్
సాంగ్స్
మొత్తానికి.. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిరభ్యరంతంగా ఈ మూవీని కుటుంబ సమేతంగా సరదాగా చూడొచ్చు.
Lubber Pandhu Rating : 2.5/5