Jr. NTR: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత.. అందులో నటించిన రామ్ చరణ్ (Ram charan), జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) ల గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. తెలుగు సినిమాల సత్తా ఏంటో రాజమౌళి (Rajamouli) ప్రపంచానికి పరిచయం చేశారు. ఇక ఈ సినిమాలోని “నాటు నాటు” పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగువాడు గర్వంగా తలెత్తుకొని తిరిగేలా చేశాడంటూ రాజమౌళిని, ఆ సినిమాకి మ్యూజిక్ అందించిన కీరవాణి(Keeravani), లిరిక్స్ అందించిన చంద్రబోస్ (Chandrabose) లని కూడా అభినందించారు. అంతేకాదు ఈ సినిమాలో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకి కూడా మంచి గుర్తింపు లభించింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కి ఓ హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అది కూడా రాంచరణ్ స్వయంగా చెప్పారు.అయితే రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలోనే హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.ఈ విషయాన్ని స్వయంగా ఓ హాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత బయట పెట్టడం సంచలనంగా మారింది. మరి ఇంతకీ ఆ హాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్ ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం..
హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ అంటూ హింట్ ఇచ్చిన డైరెక్టర్ జేమ్స్ గన్..
సూసైడ్ స్క్వాడ్, సూపర్ మాన్, గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలకు దర్శకుడిగా చేసిన జేమ్స్ గన్ (James gun) అంటే సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. ఈయన కేవలం దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించారు. అలా హాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా.. దర్శకుడుగా.. కొనసాగుతున్న ఈయన జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నేను ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆ నటుడితో సినిమా చేయాలి అని, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.బహుశా మా ఇద్దరి కాంబోలో ఓ సినిమా వస్తుంది కావచ్చు. నేను ఆయనతో వర్క్ చేయాలి అనుకుంటున్నాను. అలాగే ఆ నటుడు పులులు, సింహాలు ఉన్న వ్యాన్ నుండి దూకే సన్నివేశం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సీన్ చూసాక ఆ నటుడితో ఒక్కసారైనా వర్క్ చేయాలని అనిపిస్తుంది.ఆ సినిమాలో ఈ నటుడు చాలా అద్భుతంగా నటించాడు”..అంటూ జేమ్స్ గన్ జూనియర్ ఎన్టీఆర్ నటనను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒప్పుకుంటే ఆ ఘనత ఎన్టీఆర్ కే..
ఇక ఎన్టీఆర్ నటనకు ఫిదా అయినా జేమ్స్ గన్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉంది అని తన మనసులో మాట బయట పెట్టేశారు. అయితే ప్రస్తుతం ఆయన మాట్లాడిన ఈ వీడియోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ హాలీవుడ్లోకి ఎన్టీఆర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు ఒక్క దెబ్బతో ఎన్టీఆర్ నటన హాలీవుడ్ డైరెక్టర్లు కూడా మెచ్చుకునే స్థాయికి ఎదిగారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ లోకి వెళ్తే బాలీవుడ్,హాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలను కవర్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సౌత్ లో స్టార్ హీరో..అలాగే హృతిక్ రోషన్ (Hrithik roshan) నటిస్తున్న ‘వార్ 2’ లో విలన్ గా చేస్తూ బాలీవుడ్ లో కూడా అడుగు పెడుతున్నారు. ఇక హాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత అనుకుంటే హాలీవుడ్ లో కూడా సినిమా చేసి మూడు ఇండస్ట్రీలను కవర్ చేసిన హీరోగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లోకి వెళ్లిపోతారు అని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడతారో లేదో చూడాలి.