BigTV English

Naga Chaitanya : చై మిస్టిక్ థ్రిల్లర్ కోసం రంగంలోకి బాలీవుడ్ నటుడు… సీరియల్ యాక్టర్ విలన్ గా సరిపోతాడా ?

Naga Chaitanya : చై మిస్టిక్ థ్రిల్లర్ కోసం రంగంలోకి బాలీవుడ్ నటుడు… సీరియల్ యాక్టర్ విలన్ గా సరిపోతాడా ?

Naga Chaitanya : ప్రస్తుతం అక్కినేని అభిమానులు అందరి దృష్టి నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తున్న ‘తండేల్’ (Thandel) మూవీపైనే ఉంది. చై కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలోనే థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం చిత్ర  బృందం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉండగా, మరోవైపు నాగ చైతన్య నెక్స్ట్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా నాగ చైతన్య మిస్టిక్ థ్రిల్లర్ (NC 24) కోసం బాలీవుడ్ నటుడు రంగంలోకి దిగబోతున్నాడని టాక్ నడుస్తోంది. కానీ అతనొక  సీరియల్ యాక్టర్ కావడంతో, నాగ చైతన్యకి విలన్ గా సరిపోతాడా ? అన్నదే ఈ వార్తను విన్నవారి డౌట్.


నాగచైతన్య నెక్స్ట్ మూవీ కోసం బాలీవుడ్ విలన్…

‘తండేల్’ మూవీ తర్వాత నాగ చైతన్య (Naga Chaitanya) ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక మిస్టిక్ థ్రిల్లర్ (NC 24) మూవీకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల ఫిమేల్ లీడ్ రోల్స్ చేస్తుండగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర – సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా 2025 లోనే రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం చై – కార్తీక్ సినిమాకు సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చేస్తుంది.


తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు ఈ థ్రిల్లర్ (NC 24)లో మెయిన్ విలన్ కోసం వేటలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాస్తవను డైరెక్టర్ ఈ మూవీలో మెయిన్ విలన్ గా సెలెక్ట్ చేశాడని తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. త్వరలోనే స్పోర్ట్స్ శ్రీవత్సవ లుక్ టెస్ట్ ను కూడా నిర్వహించబోతున్నారట. అయితే స్పర్ష్ శ్రీవాస్తవ ‘బాలికా వధు’ అనే పాపులర్ టీవీ సీరియల్ తో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించిన ఈ యాక్టర్ ‘లాపటా లేడీస్’ వంటి సినిమాల్లో కూడా కీలక పాత్ర పోషించారు. కానీ స్పర్ష్ శ్రీవాస్తవ అనే నటుడు తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని ముఖం.

మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

ప్రస్తుతం నాగ చైతన్య (Naga Chaitanya) ‘తండేల్’ (Thandel) మూవీతో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 7న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. దాదాపు 90 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ పూర్తయ్యాక, నాగచైతన్య కాస్త గ్యాప్ తీసుకొని కార్తీక్ వర్మ మూవీని మొదలు పెట్టబోతున్నారు. ఇక ఈ సినిమాకు ‘వృషకర్మ’ (NC 24) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×