Ramayan1: కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కన్నడ నటుడు యశ్ (Yash) ప్రస్తుతం బాలీవుడ్ రామాయణం పార్ట్ 1 (Ramayan 1)లో నటిస్తున్న విషయం తెలిసిందే.నితీష్ తివారి డైరెక్షన్‌లో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా 2026 దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలోనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటిస్తుండగా సీత పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)నటిస్తున్నారు.
హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ గై నారిస్….
ఇక ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఈయన విలన్ పాత్రలో కనిపించబోతున్నారని విషయం తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ బయటకు రావడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగిపోతుంది. “రామాయణం పార్ట్-1” లో యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం యష్‌తో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ గై నారిస్(Guynorris) రంగంలోకి దిగారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన హీరో యశ్ తో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మిత్ మీట్స్ మ్యాడ్‌నెస్…
హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ అయిన గై నారిస్ మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్’, ‘మాడర్టల్ కోంబాట్’ లాంటి హాలీవుడ్ సినిమాలకు పని చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలాంటి ఒక గొప్ప స్టంట్ డైరెక్టర్ ఇప్పుడు రామాయణం సినిమాకు పని చేయబోతున్నారనే విషయం తెలియడంతో చిత్రబృందం భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశారని స్పష్టం అవుతుంది.”మిత్ మీట్స్ మ్యాడ్‌నెస్” అనే ట్యాగ్ లైన్ తో ఈ కాంబినేషన్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తుంది.
గై నారిస్ చేసే ఈ యాక్షన్ స్టంట్స్ రామాయణం సినిమాకి అత్యంత హైలెట్ గా నిలవబోతాయని చెప్పాలి. ప్రస్తుతం ఈ యాక్షన్ సన్ని వేషాలను రూపొందించడం కోసం ముంబైలో ప్రత్యేకంగా భారీ సెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ టీమ్‌తో కలిసి పనిచేస్తున్నారు, దీనివల్ల ‘రామాయణం పార్ట్-1’ ఒక విజువల్ స్పెక్టాకిల్‌గా ఉండబోతుందని చిత్ర బృందం తెలియచేస్తున్నారు. ఇక ఇప్పటివరకు రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం అన్నింటికి చాలా భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. వచ్చే దీపావళి పండుగను పురస్కరించుకొని ఏకంగా ఐదు భాషలలో ఒకేసారి ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో షూటింగ్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మరి ఈ రామాయణం సినిమాతో యశ్, సాయి పల్లవి, రణబీర్ కపూర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సింది.