BigTV English

HoneyRose : మరోసారి చిక్కుల్లో పడిన హనీరోజ్.. వేధింపులు తట్టుకోలేక ఏం చేసిందంటే!

HoneyRose : మరోసారి చిక్కుల్లో పడిన హనీరోజ్.. వేధింపులు తట్టుకోలేక ఏం చేసిందంటే!

HoneyRose : వీర సింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళీ భామ హాని రోజ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. కేరళకు చెందిన ఓ వ్యాపారవేత్త తనను లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపణలు చేయడంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇప్పుడు తన ఫేస్ బుక్ వేదికగా సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వర్ తనను వేధిస్తున్నాడంటూ తెలిపింది. ఈ విషయంపై కోర్టుకు వెళ్తానని.. న్యాయబద్ధంగా పోరాటం చేస్తానని వెల్లడించింది.


మలయాళీ నటి హాని రోజ్ కేరళ వ్యాపారవేత్త బాబీ చెమ్మనుర్ తనను లైంగికంగా వేధిస్తున్నట్టు సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలతో పాటు కేసు కూడా నమోదు చేయడంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇప్పుడు మరో వ్యక్తిపై సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారు. తనపై సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వర్ దుష్ప్రచారం చేస్తున్నాడంటూ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఫేస్బుక్ వేదికగా ఆరోపించారు. తాను బాబీ చెమ్మనుర్ పై చేసిన లైంగిక వేధింపులు ఫిర్యాదు తీవ్రతను మార్చేందుకు, ప్రజల అభిప్రాయాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాహుల్ ఈశ్వర్ ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

రాహుల్ ఈశ్వర్ తనను ఎంతగానో వేధిస్తున్నాడని.. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాడని తెలిపింది. ఈ వేధింపులతో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని ఫేస్ బుక్ లో రాసుకొచ్చింది. ఈ విషయంపై ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సైతం ఫేస్ బుక్ వేదికగా పంచుకుంది.


ఇక హనీ రోజ్ ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ లో.. “రాహుల్ ఈశ్వర్… మీరు చేసిన ఆరోపణలతో నేను నా కుటుంబం చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నాం. ఈ ఒత్తిడికి ప్రధాన కారణం మీరు కూడా. నాపై బహిరంగ వేదికపై జరిగిన అమానుషమైన చర్య పై మాత్రమే నేను ఫిర్యాదు చేశాను. పోలీసులు నా ఫిర్యాదును సరైనదిగా భావించారు కాబట్టి కేసు నమోదు చేశారు. నేను ఫిర్యాదు చేసిన ఈ కేసుపై కోర్టు విచారణ జరిపించి రిమాండ్ విధించింది అని తెలిపారు.

ALSO READ : వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న బాలయ్య.. ఆమె కారణమా..?

అంతే కాకుండా..”నేను చేసిన పని ఫిర్యాదు చేయడం మాత్రమే. మిగిలిన విషయాలు ప్రభుత్వం, పోలీసులు, కోర్టు చూసుకుంటాయి. ఇక నా ఫిర్యాదు తీవ్రతను వక్రీకరించడానికి మీరు చేసే ప్రయత్నాలు అర్థమవుతూనే ఉన్నాయి. ప్రజాభిప్రాయాన్ని నాకు వ్యతిరేకంగా మార్చడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సైబర్ స్పెస్ లో ఓ వ్యవస్థను సైతం తయారు చేస్తున్నారు. ఇది అస్సలు సరైన విషయం కాదు. ఈ విషయాన్ని నేను అంత తేలికగా తీసుకోను. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తా.. ” అంటూ హనీ రోజ్ ఫేస్ బుక్ లో తెలిపింది.

ఇక కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనుర్ తాను ఎక్కడకు వెళితే అక్కడికి వస్తూ తనను వేధిస్తున్నాడని హనీ రోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని కూడా తెలిపింది. ఓ సారి తనను ఒక ఈవెంట్ కు పిలిచాడని, తాను హాజరుకాలేదని అప్పటి నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపింది. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి ఆ వ్యక్తి ని అదుపులోకి తీసుకున్నారు.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×