Honey Rose.. మలయాళ బ్యూటీ హనీ రోజ్ (Honey Rose) ఒకప్పుడు ఈ వర్షం సాక్షిగా సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే 2023 సంక్రాంతి బరిలో బాలయ్య (Balakrishna )హీరోగా నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు మళ్ళీ వచ్చింది. ఇక ఈ సినిమాతో ఆమె ఒక్కసారిగా పాపులారిటీ దక్కించుకుంది. ఇందులో మీనాక్షి క్యారెక్టర్ లో నటించి అందరిని అబ్బురపరిచింది. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. గుర్తింపైతే లభించింది కానీ అవకాశాలు మాత్రం రాలేదని చెప్పాలి. ఇదిలా ఉండగా గత రెండు మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. దీనికి కారణం ఒక బడా వ్యాపారవేత్త తనను లైంగికంగా వేధిస్తున్నాడని, తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సుదీర్ఘ పోస్ట్ కూడా షేర్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాబీ చెమ్మనూరును అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఇతడితో పాటు మరో 27 మందిపై ఎర్నాకులం పోలీసులు కేసు నమోదు చేశారు.
హనీ రోజ్ డ్రెస్ సెన్స్ పై కామెంట్స్..
ఈ సందర్భంగా స్పందించిన హనీ రోజ్.. తన లుక్స్ పై ఎవరైనా సరదా జోక్స్, మీమ్స్ చేస్తే స్వాగతిస్తాను. కానీ అవి హద్దు దాటి అసభ్యకరంగా మారితే మాత్రం సహించను అంటూ స్పష్టం చేసింది. ఇదే సమయంలో వ్యాపారవేత్త అయిన బాబీ చెమ్మనూరుకు ఒక కామెంటేటర్ మద్దతుగా నిలిచారు. దీంతో అతడిపై హనీ రోజ్ దిమ్మ తిరిగేలా రియాక్ట్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా తనను వేధింపులకు గురిచేసిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న సందర్భంగా, అతడికి మద్దతుగా నిలిచారు కామెంటేటర్ రాహుల్ ఈశ్వర్ (Rahul Eshwar). దీంతో అతడు స్పందిస్తూ.. ఆమె ధరించే డ్రస్సులపై విమర్శిస్తూ…ఇలాంటి కామెంట్లు సమాజంలో సహజమే అని కామెంట్ చేశారు.
దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బ్యూటీ…
దీంతో దీనిపై స్పందించిన హానీ రోజ్ రాహుల్ ఈశ్వర్ పై విరుచుకుపడ్డారు. “ఆలయ పూజారుల కుటుంబానికి చెందిన రాహుల్ ఈశ్వర్ స్వయంగా ఆలయ పూజారి కాకపోవడం అదృష్టమే అని, తన నోటికి పని చెప్పిన ఈమె.. అతను పూజారి అయితే ఆలయానికి వచ్చే మహిళలకు డ్రెస్ కోడ్ విధించేవాడు అంటూ ఘాటుగా స్పందించింది. స్త్రీల దుస్తులను చూసినప్పుడు అతనికి భాష పై కంట్రోల్ తప్పినట్లు కనిపిస్తోంది.. ఎలాంటి వస్త్రధారణ మీ స్వీయ నియంత్రణకు భంగం కలిగిస్తుందో ఎవరు అంచనా వేయగలరు?” అని ప్రశ్నిస్తూ దిమ్మతిరిగేలా రియాక్ట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
హనీ రోజ్ కి మద్దతుగా అమ్మ..
ఇదిలా ఉండగా ప్రస్తుతం హనీ రోజ్ కు మలయాళం మూవీ ఆర్టిస్ట్ సంఘం (AMMA ).మద్దతు తెలిపింది.. సోషల్ మీడియా వేదికగా ఆమెపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మద్దతు నిలిచింది. అవసరమైతే న్యాయ సహాయం కూడా అందజేస్తామని తెలిపింది. ఏది ఏమైనా ఎంతో భవిష్యత్తు ఉన్న హనీ రోజ్.. ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడంతో అభిమానులు చాలా ఎమోషనల్ అవుతున్నారు.