BigTV English

Jailer2 : తెలుగు స్టేట్స్ లో రైట్స్ కోసం బిగ్ వార్, ప్రొడ్యూసర్ తగ్గేదేలే

Jailer2 : తెలుగు స్టేట్స్ లో రైట్స్ కోసం బిగ్ వార్, ప్రొడ్యూసర్ తగ్గేదేలే

Jailer2 : మామూలుగా ఒక సినిమా హిట్ అయింది అని అంటే ఆ సినిమాకు సంబంధించిన సీక్వెల్ మీద అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అసలు ఈ సినిమాలకు సీక్వెల్స్ తీసుకొచ్చింది ఎస్.ఎస్ రాజమౌళి అని చెప్పాలి. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతోనే తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. బాహుబలి సినిమా హిట్ అయిన వెంటనే బాహుబలి పార్ట్ 2 అనౌన్స్ చేశాడు రాజమౌళి. బాహుబలి 1 సినిమా నుంచి బాహుబలి 2 ఇంకా పెద్ద హిట్ అయింది. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకుంది. అక్కడితో పాన్ ఇండియా సినిమాలు రావడం మొదలయ్యాయి. పాన్ ఇండియా సినిమాలు పార్టులుగా రావడం మొదలయ్యాయి. ఇప్పుడు చాలా సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి.


జైలర్ 2 సినిమాకి భారీ డిమాండ్

సినిమాలు పార్ట్స్ గా రావడం అనేది కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలు కి మాత్రమే పరిమితం కాకుండా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా జరుగుతుంది. ఇదివరకే మణిరత్నం దర్శకత్వం వహించిన పోన్నియన్ సెల్వన్ సినిమా కూడా 2 పార్ట్స్ లో విడుదలైంది. ఇక ప్రస్తుతం చాలామంది లోకేష్ కనగరాజ్ ఖైదీ 42 గురించి ఎదురు చూస్తున్నారు. అలానే నెల్సన్ దర్శకత్వంలో వస్తున్న జైలర్ 2 సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లో భారీ డిమాండ్ మొదలైంది. ఈ సినిమా కోసం పెద్ద ప్రొడక్షన్ హౌస్ 60 కోట్లు తెలుగు రైట్స్ కోసం ఆఫర్ చేసింది. కానీ ప్రొడ్యూసర్ ఎక్కడ తగ్గకుండా 100 కోట్ల వరకు అడుగుతున్నారు. అలానే జైలర్ సినిమా తెలుగులో కూడా మంచి మార్కెట్ చేసిన విషయం తెలిసిందే. అలానే మరో ప్రొడక్షన్ హౌస్ కూడా జైలర్ రైట్స్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది.


రజనీకాంత్ కం బ్యాక్

బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ తో చేసిన బీస్ట్ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రజనీకాంత్ అభిమానులు సూపర్ స్టార్ ని ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాడు. ముఖ్యంగా కొన్ని ఎలివేషన్స్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి. ప్రతి ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నటులను తీసుకొచ్చి ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. అన్నింటిని మించి ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అందుకే జైలర్ 2 సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Also read : Raja saab : హాలిడే నుండి ప్రభాస్ వచ్చి డబ్బింగ్ స్టార్ట్ చేసేది అప్పుడే

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×