BigTV English

The Raja Saab : హాలిడే నుండి ప్రభాస్ వచ్చి డబ్బింగ్ స్టార్ట్ చేసేది అప్పుడే

The Raja Saab : హాలిడే నుండి ప్రభాస్ వచ్చి డబ్బింగ్ స్టార్ట్ చేసేది అప్పుడే

The Raja Saab : 2012లో రిలీజ్ అయిన ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మారుతి. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక చిన్న సినిమాగా వచ్చి పెద్ద సంచలనాన్ని సృష్టించింది ఈ రోజుల్లో అనే సినిమా. ఆ సినిమా తర్వాత అదే సంవత్సరంలో బస్ స్టాప్ అనే మరో సినిమాని తెరకెక్కించాడు మారుతి. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత మారుతి రాసిన సినిమా ప్రేమ కథ చిత్రం. ఈ సినిమా హర్రర్ కామెడీ గా ప్రేక్షకులు ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో మారుతి స్థాయి ఇంకొంత పెరిగిందని చెప్పొచ్చు. అయితే ఆ తర్వాత 2014లో కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు మారుతి. అదే ఇయర్లో అల్లు శిరీష్ తో చేసిన కొత్తజంట సినిమాతో మళ్లీ మంచి హిట్ అందుకున్నాడు మారుతి.


భలే భలే మగాడివోయ్ సినిమాతో మార్పు

ఇకపోతే ఈ రోజుల్లో సినిమాతో తన జర్నీని స్టార్ట్ చేసిన మారుతి భలే భలే మగాడివోయ్ సినిమాతో తన పంథాను మార్చుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఫ్యామిలీస్ అందరూ చూడగలిగే సినిమాలను మాత్రమే దర్శకత్వం వహించాడు. నాని కెరియర్ లో భలే భలే మగాడివే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చేసిన బాబు బంగారం, మహానుభావుడు, శైలజ రెడ్డి అల్లుడు, ప్రతిరోజు పండగే ఇటువంటి సినిమాలు అన్నిటితో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు మారుతి. ఇప్పుడు మారుతి చేస్తున్న సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మారుతి ఇప్పుడు చేస్తున్నది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లోని ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని చూసి చాలా రోజులైంది. ఆ యాంగిల్ ని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాడు మారుతి.


టీజర్ రిలీజ్ అప్పుడే

ప్రస్తుతం ప్రభాస్ హాలిడే లో ఉన్న సంగతి తెలిసిందే, మే మొదటి వారంలో ప్రభాస్ హాలిడే నుంచి రానున్నారు. వచ్చిన వెంటనే రాజసాబ్ సినిమాకి సంబంధించి డబ్బింగ్ పనులు మొదలు పెట్టమన్నారు. డబ్బింగ్ పూర్తముగానే అదే నెలలో టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. ఒకవేళ ఇదే జరిగినట్లయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎప్పటినుంచో ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి తప్ప అప్డేట్లు రావడం లేదు. ఎట్టకేలకు వచ్చే నెలలో టీజర్ అని వార్తలు వినిపిస్తున్నాయి దీని గురించి అధికార ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

Also Read : Pooja Hegde: దయచేసి మేకప్ లేకుండా రండి అని నాతో చెప్పారు – పూజా హెగ్డే

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×