Sai Pallavi: కొంతమంది హీరోయిన్లు ఎలాంటి మేకప్ లేకుండా తమ నటనతోనే ప్రేక్షకుల మనసు దోచేస్తారు. అలాంటి వారిలో సాయి పల్లవి(Sai Pallavi)ఒకరు.. తాను నటించే ఏ సినిమాలో అయినా సరే నేచురల్ గానే కనిపించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన అభిమానులపై మండిపడింది. అలా ఫొటోస్ తీయడం నాకు అస్సలు నచ్చదు అంటూ సాయి పల్లవి తన మనసులో మాట బయట పెట్టింది. మరి ఇంతకీ సాయి పల్లవికి అభిమానులు ఎందుకు కోపం తెప్పించారు..? సాయి పల్లవి ఏం మాట్లాడింది? అనేది ఇప్పుడు చూద్దాం..
తండేల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి..
సౌత్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు అంటే.. అందరి నోళ్లలోకి సాయి పల్లవి పేరు మాత్రమే వస్తుంది. అయితే అలాంటి సాయి పల్లవి నటించిన ‘తండేల్’ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్,గ్లింప్స్,పాటలు అన్నీ కూడా ప్రేక్షకుల్లో భారీ హైప్ ని తీసుకు వచ్చాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే అని, నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) కాంబోలో వస్తున్న ఈ సినిమా ‘లవ్ స్టోరీ’ కంటే పెద్ద హిట్ అవుతుంది అని అభిమానులు అనుకుంటున్నారు. అయితే సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అభిమానులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. చాలామంది సెలబ్రిటీలు బయట కనిపిస్తే అక్కడ ఉండే వారి అభిమానులు.. వారి చుట్టూ చేరి ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడం చేస్తూ ఉంటారు.ఇక మరికొంత మందేమో అభిమానం పేరుతో వారిని ఇబ్బందులకు కూడా గురిచేస్తారు. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు బయటికి వెళ్లిన సమయంలో వారిని సెల్ఫీల పేరుతో ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన సంగతి మనకు తెలిసిందే.
పర్మిషన్ లేకుండా ఫోటోలు దిగడం నచ్చదు..
ఈ విషయం పక్కన పెడితే.. సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో అలాంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను ఎక్కడికైనా బయటికి వెళ్తే మాత్రం నాకు చాలా భయమేస్తుంది.ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను అదోరకంగా చూస్తారు. నేను సెలబ్రిటీని కాబట్టి అందరూ నన్ను వింతగా చూస్తారు.ఆ టైంలో నాకు కాస్త బిడియంగానూ, భయంగానూ ఉంటుంది. ఆ టైంలో అభిమానులు ఎవరైనా నా దగ్గరికి వస్తే వారిని ఎలా పలకరించాలో కూడా నాకు తెలియదు. వారిని చూసి నా మైండ్ లో మొత్తం టెన్షన్ నిండిపోతుంది. ఇక కొంతమంది అయితే నన్ను అడగకుండా నా పర్మిషన్ తీసుకోకుండానే ఫోటోలు తీసుకుంటారు.అలా ఫోటోలు తీసుకునే వారిని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది.అలా అడగకుండా ఫొటోస్ తీసే బదులు అడిగి తీసుకోవచ్చు కదా.. అలా నా ప్రమేయం లేకుండా ఫొటోస్ తీయడం నాకు అస్సలు నచ్చదు. ఒక్కొక్కసారి ఇలాంటివి ఆలోచించి ఓవర్ థింకింగ్ చేయడం వల్ల నా మైండ్ నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. అందుకే వాటిని కంట్రోల్ చేయడం కోసం ప్రతిరోజు ధ్యానం చేస్తాను. కోపాన్ని కంట్రోల్ లో పెట్టుకోవడం కోసం ధ్యానం చేయడం బెస్ట్ అని నా ఉద్దేశం అంటూ సాయి పల్లవి రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్న సాయి పల్లవి..
అయితే సాయి పల్లవి అందరి సెలబ్రెటీల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది సెలెబ్రిటీలు కాస్త ఫేమ్ రాగానే పొగరు చూపిస్తూ ఉంటారు.కానీ సాయి పల్లవి మాత్రం అలా వ్యవహరించదు. తనకు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్లు, పార్టీలు, పబ్బులు అంటూ తిరగకుండా దేవాలయాలను దర్శించుకుంటూ ఉంటుంది.అలాగే ఆ మధ్యకాలంలో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీల దగ్గరికి వెళ్లి పనిచేసి వారిలో ఒకరిలా కలిసిపోయి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక పెద్ద హీరోయిన్ ఇలా పని వాళ్ళతో కలిసి పనిచేయడం ఏంటి? అని అందరూ షాక్ అయిపోయారు. ఇక సాయి పల్లవి సింప్లిసిటీకి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక సాయి పల్లవి కేవలం సౌత్ లోనే కాకుండా రామాయణం సినిమాతో నార్త్ లో కూడా అలరించబోతుంది.నితేష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణం సినిమా 2026 లో విడుదల కాబోతోంది. అలాగే సాయి పల్లవి అమీర్ ఖాన్ (Aamir Khan) కొడుకు జునైద్ ఖాన్(Junaidh khan)తో కూడా ఓ సినిమాలో నటిస్తుంది.