BigTV English

Samantha : అదే నా జీవితాన్ని మార్చేసింది.. కోట్లు వదులుకున్న సమంత..

Samantha : అదే నా జీవితాన్ని మార్చేసింది.. కోట్లు వదులుకున్న సమంత..

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు మలయాళీ ముద్దుగుమ్మ అయినా తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది.. ఒకవైపు చేతి నిండా సినిమాలు.. మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ అప్పట్లో బాగా బిజీగా ఉండేది సమంత. మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకున్న ఈమె ఒక్కో మూవీతో స్టార్ ఇమేజ్ ను పెంచుకుంది. సమంత ఈ మధ్య తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా కూడా తెలుగు అభిమానులకు టచ్ లోనే ఉంది. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. తాజాగా ఈమె ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టింది. కోట్ల రూపాయల్లో వదిలేసుకున్నానని చెప్పింది. అసలు మ్యాటరేంటంటే..


ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు..

హీరోయిన్ సమంత మహిళల కోసం ఎన్నో రకాల షోలను చేస్తున్నారు. అందులో కొన్ని షోలు ఆమెకు మంచి పేరును అందించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మానసిక ఆరోగ్యం, వ్యాపార సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేయడం గురించి మాట్లాడారు.. అదే ఇప్పుడు నెట్టింట ఆసక్తిగా మారింది. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన కొత్తల్లో ఒకవైపు సినిమాలు తో పాటు ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించాను. అంటే అప్పట్లో ఇలాంటి ప్రకటనలతోనే సక్సెస్ రేట్ ని నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు అదంతా పూర్తిగా మారిపోయింది.. 20 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పట్లో ఎన్ని సినిమాలు చేశాం. కేవలం డబ్బులు మాత్రమే కాదు దాని గురించి అన్నీ విషయాలు తెలుసుకోవాలి. లేకుంటే మనవల్ల మరొకరు నష్టపోతారని తెలుసుకున్న అందుకే నా నిర్ణయాన్ని మార్చుకున్న అని ఆమె అన్నారు..


Also Read: గీతూ లైఫ్ లో కష్టాలు.. భర్తతో ఎందుకు విడిపోయింది..?

ఆ తప్పు మళ్లీ చెయ్యను..

హీరోయిన్ సమంత ఒకపుడు వరుస సినిమాలతో పాటుగా అటు వాణిజ్య ప్రకటనలతో కూడా బిజీగా ఉంటుంది. అయితే చైతన్యతో విడిపోయాక సినిమాలు చెయ్యడం మానేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తుంది. అయితే పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంత తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని నమ్మలేని నిజాలను బయట పెట్టింది. బ్రాండ్ ప్రమోషన్స్ గురించి అనేక విషయాలను షేర్ చేసుకుంది. ఎన్నో బహుళజాతి కంపెనీల ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించా. అది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని తెలుసుకున్నా. అందుకే ఎక్కువగా ప్రమోషన్స్ చెయ్యలేదని బయట పెట్టింది. ఒకప్పుడు పెద్దగా ఆలోచించకుండా కొన్ని బ్రాండ్లకు ప్రమోషన్స్‌ చేశా. అందుకు ఇప్పుడు సారీ చెబుతున్నా. కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్దపడినా ఏడాది కాలంలో 15 బ్రాండ్లు వదులుకున్నా. ఇప్పటికీ చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ అన్నీ దృష్టిలో ఉంచుకొని మాత్రమే చేస్తాను అని తేల్చి చెప్పేసింది.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో సామ్ బిజీగా ఉంది. హీరోయిన్ గా మాత్రమే కాదు. నిర్మాతగా కూడా రానిస్తూ వస్తుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×