BigTV English

Oats: నానబెట్టిన ఓట్స్ తినడం వల్ల.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే ?

Oats: నానబెట్టిన ఓట్స్ తినడం వల్ల.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే ?

Oats: ఓట్స్ ఆరోగ్యకరమైన అల్పాహారంగా పరిగణించబడుతుంది. ఓట్స్ అనేది ఒక రకమైన ధాన్యం. వీటిలో పోషకాలు  సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఓట్స్‌లో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా  ఉంటాయి. సాధారణంగా ఓట్స్‌ను పాలలో 5 నుండి 10 నిమిషాలు ఉడికించి తింటుంటారు. కానీ ఉడికించిన తర్వాత.. ఓట్స్ లో తేనె, డ్రై ఫ్రూట్స్ కలిపి తినడం ద్వారా వాటి రుచి మరింత పెంచవచ్చు.


మీరు ఓట్స్ ఉప్మా తయారు చేసుకుని కూడా తినవచ్చు. ఓట్స్ స్మూతీ, చీలా కూడా ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ లు . రాత్రిపూట ఓట్స్ నానబెట్టి ఉదయం తింటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. దీనివల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉంటాయట.

 ఓట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:


ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ వంటి కరిగే ఫైబర్ ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీన్ని తినడం వల్ల కడుపు చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది.  ఓట్స్ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

బరువు నిర్వహణ:
ఓట్స్‌లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి . ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆకలిని కూడా  నియంత్రిస్తుంది. అతిగా తినే అలవాట్లను నివారించడానికి కూడా సహాయపడుతుంది. నానబెట్టిన ఓట్స్ జీర్ణం కావడం చాలా సులభం. ఇందులో ఉండే ఫైబర్, నీరు మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

డయాబెటిస్ నియంత్రణ:
నానబెట్టిన ఓట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీని వల్ల డయాబెటిస్ రోగులు ప్రయోజనం పొందుతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం పూట నానబెట్టిన ఓట్స్ తినాలి. ఇది వారికి చాలా ఆరోగ్యకరం.  అంతే కాకుండా ఇలా చేయడం వల్ల మధుమేహం కూడా నియంత్రణలో ఉంది.

ఆరోగ్యకరమైన గుండె:
ఓట్స్‌లో లభించే బీటా గ్లూకాన్ , యాంటీఆక్సిడెంట్లు మన గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది రక్తపోటు , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన ఓట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

శక్తి వనరు:
ఓట్స్‌లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి మన శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందిస్తాయి.  అంతే కాకుండా వీటిలో మంచి మొత్తంలో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదల, మరమ్మత్తుకు సహాయ పడుతుంది. రాత్రిపూట నానబెట్టిన ఓట్స్ తినడం వల్ల మన శరీరానికి శక్తి అవసరం కూడా తీరుతుంది. పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్ కూడా లభిస్తుంది.

Also Read: మీరు వాడే ఉప్పు సరైనదేనా ? ఇంతకీ.. ఎలాంటి ఉప్పు వాడుతున్నారు ?

జీవ క్రియ రేటును మెరుగుపరుస్తుంది:
ఓట్స్‌ను రాత్రిపూట నానబెట్టడం వల్ల కేలరీలు బాగా తగ్గుతాయి. తద్వారా పోషకాల శోషణ మెరుగుపడుతుంది.  మన జీవక్రియ కూడా బాగా జరుగుతుంది. మీరు పాలు లేదా పెరుగు లేదా నీటిలో  రాత్రంతా నానబెట్టి ఓట్స్‌ను తయారు చేసుకోవచ్చు. దాని పోషక విలువలను పెంచడానికి పండ్లు, గింజలు, విత్తనాలను కూడా కలుపుకోవచ్చు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×