Allu Arjun : ప్రస్తుతం తెలుగు సినిమా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని శిఖరం మీద కూర్చోబెట్టాడు ఎస్.ఎస్ రాజమౌళి. బాహుబలి లాంటి సినిమాను ఊహించడమే కష్టం అనుకుంటే, ఆ సినిమాను ఏకంగా వెండితెరపై ఆవిష్కరించాడు. ఆ సినిమా కోసం ప్రభాస్ దాదాపు 5 ఏళ్ల పాటు టైం కేటాయించాడు. అయితే ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలైంది. ఇప్పుడు ప్రభాస్ ఈ స్థాయిలో ఉన్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడు రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూడటం మొదలుపెట్టారు. తెలుగులో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమాల్లో పుష్ప 2 ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది.
ఇదివరకే వీరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. నార్త్ ఆడియన్స్ పుష్ప సినిమాకి బ్రహ్మరథం పట్టారు. అందుకోసమే పుష్ప చిత్ర యూనిట్ కూడా అక్కడి నుంచే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఒక సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ కు ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సినిమాలో తను ఒక సీన్ చూసానని చెబుతూ సినిమాకి భారీ ఎలివేషన్ ఇచ్చాడు. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ చిత్ర యూనిట్ అంతటికి తన కృతజ్ఞతలు తెలిపాడు.
ఈ సినిమా తను చేస్తున్న సందర్భంలో సుకుమార్ కష్టాన్ని చూసి, ఖచ్చితంగా ఈ సినిమా ఈయన కోసమైనా ఆడాలి అని అనుకున్నాడట. అలానే సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్యాకప్ చెప్పినప్పుడు అందర్నీ గమనిస్తూ వీళ్ళందరి కష్టం వృధా కాకూడదు అని అనుకున్నాడు. అలానే పుష్ప సినిమా గురించి చెబుతూ ఒక బాహుబలి సినిమా ఆడినప్పుడు మనమందరం ఎంతో గర్వించాం. ఆ సినిమా హీరో ప్రభాసా, రాజమౌలా అని ఎవరు చూడలేదు. అందరం కూడా ఇది మా సినిమా, మా స్థాయిని పెంచారు రాజమౌళి గారు అంటూ ఫీల్ అయ్యాం. అలానే ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చినప్పుడు కూడా ఇది మా సినిమా యావత్ భారతదేశానికి మంచి పేరు తీసుకొస్తుంది అని ఫీల్ అయ్యాం. ఆ సినిమాల తర్వాత తెలుగు వారికి పేరు తీసుకొచ్చే సినిమా పుష్ప అవుతుంది. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. అంటూ అల్లు అర్జున్ ప్రతి టెక్నీషియన్ కి తన మాటల్లో కృతజ్ఞతలు తెలియజేసాడు.
Also Read : Sukumar At Pushpa Movie Event: నా దగ్గర అసలు పుష్ప సినిమా కథ లేదు