E-Paper
Advertisement

Sukumar At Pushpa Movie Event: నా దగ్గర అసలు పుష్ప సినిమా కథ లేదు

Sukumar At Pushpa Movie Event: నా దగ్గర అసలు పుష్ప సినిమా కథ లేదు
Advertisement

Sukumar : దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్య సినిమాతో దర్శకుడుగా పరిచయమైన సుకుమార్ అంచలంచెలుగా ఎదుగుతూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్ డైరెక్టర్ హోదాను సంపాదించుకున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సుకుమార్ సత్తా ఏంటో తెలిసి వచ్చింది. సుక్కు దర్శకత్వం వహించిన పుష్ప సినిమాలోనిమ్యానరిజమ్స్ ను చాలామంది పొలిటికల్ లీడర్స్, స్పోర్ట్స్ మెన్స్ విపరీతంగా ఇమిటేట్ చేస్తూ వాడారు. దానితో ఈ సినిమాకి మరింత పబ్లిసిటీ వచ్చిందని చెప్పాలి. ఈ సినిమాను ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ విపరీతంగా ఆదరించారు. పుష్ప టు సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ.. నేను బన్నీని ఆర్య నుండి చూస్తున్నాను. తను ఎలా ఎదుగుతున్నాడు చూస్తూనే వచ్చాను. తనని వ్యక్తిగా, ఒక ఆర్టిస్టుగా చూసాను. ఈ పుష్ప అనే సినిమా ఇలా వచ్చింది అంటే దానికి కారణం కేవలం నాకు బన్నీ ఉన్న ఒక బాండింగ్ కారణంగానే. బన్నీ ఒక సీన్ కోసమో లేదా ఒక సాంగ్ కోసమో కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కోసం కూడా ఎంతో కష్టపడతాడు. అది ఎంత చిన్నదైనా సరే చాలా శ్రద్ధతో చేస్తాడు. కేవలం నీ మీద ప్రేమతోనే ఈ సినిమా నేను తీశాను. నీతో ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు నా దగ్గర పూర్తి కథ లేదు. నువ్వు నన్ను నమ్మి నాతో ప్రయాణం చేసినందుకు నీకోసం నేను ఏమైనా చేసేయొచ్చు అనిపించింది. మిగతావారు అంతా చెప్పినట్లు బన్నీ సెట్స్ లో అందర్నీ కలిపి ఒక స్థాయిలోకి తీసుకుని వెళ్లి కూర్చోబెడతాడు. దానితో అందరికీ అదే స్థాయిలో పనిచేయాలని అనిపిస్తుంది.

Advertisement

Also Read : Rashmika Mandanna : దేవిశ్రీప్రసాద్ కి స్టేజ్ పైనే ఐ లవ్ యు అని చెప్పిన హీరోయిన్…

అలాగే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు మేము మంచి ఆట ఆడటానికి సరైన గ్రౌండ్ ఇచ్చారు. పుష్ప ను రెండు భాగాలుగా చేయడానికి ముఖ్య కారణం చెర్రీ గారు. అలాగే చిత్రం కోసం సెట్స్ లో కష్టపడి పనిచేసిన రష్మిక, డిఓపి అందరికీ ధన్యవాదములు. రష్మిక గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. తను ప్రతి ఎక్స్ప్రెషన్ ఇంకా ఎమోషన్ ను చాలా బాగా క్యారీ చేసింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కి ధన్యవాదాలు. క్లైమాక్స్ లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమా ఎంతో హై ఉండబోతుంది. శ్రీలీల డాన్స్ మూవ్స్ చాలా బాగా చేసింది. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా బాగా కష్టపడ్డారు” అంటూ ముగించారు.

Advertisement

Also Read : Pushpa 2 : డిప్యూటీ సీఎం అంటూ పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×