BigTV English

Sukumar: తప్పనిసరి అయితే సినిమాలు మానేస్తా.. సుకుమార్ కీలక నిర్ణయం..!

Sukumar: తప్పనిసరి అయితే సినిమాలు మానేస్తా.. సుకుమార్ కీలక నిర్ణయం..!

Sukumar:ప్రముఖ డైరెక్టర్ సుకుమార్(Sukumar)తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించడంలో తన వంతు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు దక్కించుకున్న ఈయన ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ‘పుష్ప -2’ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా విడుదలైన 15 రోజుల్లోనే సుమారుగా రూ. 1600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ తో జోరు మీద ఉన్నారు సుకుమార్. అందులో భాగంగానే తాజాగా అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వెల్లడించిన సుకుమార్ సినిమాపై భారీగా హైప్ పెంచేశారు.


రాజమౌళి(Rajamouli)దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకున్నారు రామ్ చరణ్ (Ram Charan).ఈ సినిమా తర్వాత ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.శంకర్(S.Shankar)దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది. ఇందులో కియారా అద్వానీ(Kiara advani), అంజలి(Anjali) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే డల్లాస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ వచ్చారు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

ఈ ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించిన యాంకర్ సుమా(Suma)మాట్లాడుతూ..”దోప్ అనే పదంతో ఒకటి వదిలేయాలి అంటే? ఏం వదిలేస్తారు మీరు?” అని సుకుమార్ ను ప్రశ్నించింది. దానికి సుకుమార్ మాట్లాడుతూ.. ఒక్క సెకండ్ ఆలోచించకుండా సినిమాలు మానేస్తానని చెప్పాడు. అసలు ఇంత పెద్ద విషయాన్ని సుకుమార్ అంత సడన్గా అందరి ముందు చెప్పడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యం పోతున్నారు. ఆఖరికి ఈ సినిమా హీరో రామ్ చరణ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇకపోతే సుకుమార్ అలా అన్నారో లేదో అప్పుడే అక్కడున్న వారంతా గట్టిగా అరిచేశారు. పక్కనే ఉన్న రామ్ చరణ్ కూడా సుకుమార్ ను కొట్టి చాలా సంవత్సరాలుగా ఇలాగే బెదిరిస్తున్నారు. అలా ఏం జరగదు అంటూ కామెంట్లు చేశారు. ఏది ఏమైనా సుకుమార్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి సుకుమార్ ఈ మాట ఎందుకు అన్నాడో తెలియదు కానీ పుష్ప 2 సినిమా వివాదం వల్లే సుకుమార్ ఈ విధంగా అని ఉంటారని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


సుకుమార్ సినిమాలు..

ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ విషయంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరొకవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తర్వాత ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సనా(Bucchibabu sana) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో మూవీ ఉంటుంది. ఇక రామ్ చరణ్ తో మూవీ అయిన వెంటనే ‘పుష్ప 3’ సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×