
Titanic:- టైటానిక్ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. ఓ సెన్సేషన్. జేమ్స్ కామరూన్ వండర్ ఫుల్ క్రియేషన్. టైటానిక్ షిప్, ఐస్ బర్గ్, రెండు ముక్కలై మునిగిపోవడం.. ఇవన్నీ రియల్‌గా జరిగినవే. కాని, రియల్‌గానే ఓ లవ్ స్టోరీ జరిగిందా అన్నంతగా మాయ చేశాడు జేమ్స్ కామరూన్. ప్రేక్షకులు ఆ యూనివర్స్‌లోకి వెళ్లిపోవడానికి కారణం డికాప్రియో అండ్ కేట్ విన్‌స్లెట్. మరీ ముఖ్యంగా రోజ్ క్యారెక్టర్‌లో జీవించిన కేట్ విన్‌స్లెట్.
ఇప్పుడీ మ్యాటర్ ఎందుకంటే… టైటానిక్ సినిమాను కేట్ విన్‌స్లెట్ అస్సలు సీరియస్‌గా తీసుకోలేదట. ఈ వద్దనుకున్నానని, చేయాలనుకోలేదని స్టేట్ మెంట్ ఇచ్చింది.
టైటానిక్ ఆడిషన్ సమయంలో కేట్ విన్‌స్లెట్ కు ఎదురైన అనుభవాన్ని మీడియాతో షేర్ చేసుకుంది. ఈ సినిమా కోసం దర్శకుడు జేమ్స్ కామెరూన్ తన టీమ్‌తో కలిసి వందలమందిని ఆడిషన్ చేశారు. అదే ఆడిషన్‌కు కేట్ విన్‌స్లెట్ కూడా వెళ్లింది. అయితే, అప్పటికే 5 సినిమాల్లో నటించి ఉండడం వల్ల ఆడిషన్ తీసుకోకపోవచ్చని అనుకుంది. అయినా సరే అందరితోపాటే ఆడిషన్‌కి వెళ్లింది. పైగా ఆడిషన్ చేస్తున్న వ్యక్తిని చూస్తే చాలా చిరాకేసిందని చెప్పుకొచ్చింది. తాను చేస్తున్నది, చెబుతున్నది ఆడిషన్ చేసే వ్యక్తి సరిగా వినిపించుకోలేదని, ఓవైపు నటించి చూపిస్తున్నా.. ఆ ఊ అంటున్నాడే తప్ప తన ఒపీనియన్ ఏంటో చెప్పలేదని ఫ్రస్ట్రేట్ అయింది. సో, టైటానిక్ సినిమా తనకు సెట్ కాదనుకుని, అక్కడ్నుంచి వెళ్లిపోదాం అనుకున్నానని చెప్పుకొచ్చింది. కానీ ఊహించని రీతిలో మరో రౌండ్ ఆడిషన్‌కి పిలిచారని సంబరంగా చెప్పింది. ఆ రోజు ఫ్రస్ట్రేషన్ తెప్పించినప్పటికీ.. చివరికి రోజ్ క్యారెక్టర్‌కు సెలక్ట్ చేయడం ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది కేట్ విన్‌స్లెట్.
టైటానిక్ విషాదంత సినిమానే అయినా.. అందులోని లవ్ స్టోరీని మాత్రం ఎవరూ మరిచిపోరు. ఈ జనరేషన్‌కి టైటానిక్ అంటే ఘోర ప్రమాదంగా కాకుండా ఇద్దరు ప్రేమికులు ఓడ మునిగిపోవడం వల్ల విడిపోయారనే కథగానే గుర్తుండిపోయింది. అంతగా ఇంప్రెస్ చేశాయి రోజ్ అండ్ జాక్ క్యారెక్టర్స్. నిజానికి రోజ్ క్యారెక్టర్లో కేట్ ఉంది కాబట్టే.. బహుశా ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యారేమో అనిపిస్తుంటుంది.